వ్యాక్సిన్ మిక్సింగ్ సురక్షితం

- ఒక డోసు కొవిషీల్డ్, ఒక డోసు కొవాగ్జిన్ వేసుకోవచ్చు
- రెండింటితో అధికంగా యాంటిబాడీల ఉత్పత్తి
- ఒమిక్రాన్‌పైనా సమర్థంగా పని
- నాలుగు రెట్ల అధిక స్పందన.. కనిపించని ప్రతికూలతలు
- తొలిసారి హైదరాబాద్ ఏఐజీ దవాఖాన అధ్యయనం
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3: ఒక డోసు కొవిషీల్డ్ వేసుకొన్నవారు.. ఇంకో డోస్ కొవాగ్జిన్ వేసుకోవచ్చా? రెండు వేర్వేరు వ్యాక్సిన్లు వేసుకొంటే ఇబ్బందవుతుందా? అంటే.. భేషుగ్గా, ఎలాంటి భయం లేకుండా, నిరభ్యంతరంగా వ్యాక్సిన్ మిక్సింగ్ చేయవచ్చని చెప్తున్నారు హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖాన శాస్త్రవేత్తలు. సాధారణం గా ప్రతి ఒక్కరు ఒకే రకమైన రెండు డోసుల కరోనా టీకా తీసుకోవాలి. కానీ, రెండు వేర్వేరు టీకాలు తీసుకోవటం కూడా సురక్షితమేనని ఏఐజీ హాస్పిటల్ జరిపిన అధ్యయనంలో తేలిందని దవాఖాన చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. మిక్స్డ్ వ్యాక్సిన్ సురక్షితమే కాకుండా ఒకే రకమైన టీకాలు తీసుకొన్న వారిలో కంటే వేర్వేరు రకాల టీకాలు తీసుకొన్నవారిలో ప్రతిరోధకాల స్పందన అధికంగా ఉన్నట్టు ఆయన వివరించారు. టీకా వేయించుకోని, కరోనా వ్యాధి సోకని 330మంది ఆరోగ్యవంతులపై అధ్యయనం జరపగా 44మందికి ‘సీరో నెగెటివ్’ వచ్చినట్టు తేలిందని వివరించారు. వేర్వేరు రకాల రెండు డోసు లు ఇచ్చిన ఏ ఒక్కరిలోనూ ప్రతికూల ప్రభావాలు కనిపించలేదని వెల్లడించారు.
స్పైక్ ప్రొటీన్‌ను తటస్థీకరించే ప్రతిరోధకాలు అధికం
ఒకే రకమైన వ్యాక్సిన్ తీసుకొన్న వారితో పోల్చితే వేర్వేరు రకాల వ్యాక్సిన్లు తీసుకొన్న వారిలో స్పైక్ ప్రొటీన్‌ను తటస్థీకరించే ప్రతిరోధకాల సంఖ్య అధికంగా ఉన్నట్టు ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైందని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఒకే రకమైన టీకా తీసుకొన్నవారి కంటే వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకొన్న వారిలో ప్రతిరోధకాల ప్రతిస్పందన నాలుగు రెట్లు అధికంగా ఉన్నదని వెల్లడించారు. స్పైక్ ప్రొటీన్‌ను తటస్థీకరించే ప్రతిరోధకాలు వైరస్‌ను అంతం చేయటం వల్ల వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే స్వభావం తగ్గిపోతుందని వివరించారు. ఈ నెల 10నుంచి ప్రారంభమయ్యే ప్రికాషన్ డోసులో వ్యాక్సిన్ మిక్సింగ్‌ను సూచనప్రాయ అధ్యయనంగా పరిగణించాలని ఐసీఎంఆర్‌ను ఆయన కోరారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

