న్యూఢిల్లీ : సంప్రదాయ దేశీ రుచులనే (Health Tips) కొద్దిపాటి మార్పుచేర్పులతో అటు టేస్టీగా ఉంటూనే ఇటు శరీరానికి తక్షణ శక్తినీ, ఉత్తేజాన్నీ అందించేలా చేసుకోవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అందరూ ఎంతో ఇష్టంగా తినే భేల్పురిని అలసట, నిస్సత్తువను మటుమాయంలా చేసే టిప్స్‌ను న్యూట్రిషనిస్టులు అందిస్తున్నారు.
నోరూరించే ఈ చాట్‌ను అందరూ ఇష్టంగా తింటారు. భేల్పురిలో మరమరాలు, సేవ్, పాప్డి మరికొన్ని వేయించిన పదార్ధాలను వాడి టేస్టీ స్నాక్‌గా తయారుచేస్తుంటారు. అయితే దీన్ని మరింత ఆరోగ్యకరంగా మలిచేందుకు వీటిలో స్ర్పౌట్స్, ఉడకబెట్టిన నల్ల శనగలు, కాబూలీ శనగలతో పాటు పెసలు, ఉలవల వంటి తృణధాన్యాలను కలిపితే ప్రొటీన్ భేల్ తయారవుతుంది.
స్ప్రౌట్స్, శనగల్లో ప్రొటీన్లు అధికంగా ఉండటంతో శరీరానికి అవసరమైన శక్తి అందడమే కాకుండా ఇందులో తగినంత ఫైబర్ ఉండటంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. ఫైబర్ అధికంగా ఉండటంతో జీర్ణక్రియ సాఫీగా సాగి మలబద్ధకాన్ని నివారిస్తుంది.
Read More :
Shikhar Dhawan: శిఖర్ ధావన్‌కు విడాకులు మంజూరీ చేసిన ఫ్యామిలీ కోర్టు