Japan | జపాన్‌లో సాయంత్రం సమయంలో ఆహార పదార్థాలపై రాయితీ.. ఎందుకో తెలుసా..?
జపాన్ పర్యటనకు వెళ్లే పర్యాటకులు ఆహారం కోసం చేసే ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చని ఓ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ వెల్లడించారు. అక్కడి సూపర్మార్కెట్లు, కన్వీనియన్స్ స్టోర్లలో సాయంత్రం వేళ తాజా ఆహార పదార్థాలపై భారీ రాయితీలు లభిస్తాయని తెలిపారు. సరైన సమయంలో కొనుగోలు చేస్తే కొన్ని పదార్థాలను 80 శాతం వరకు తక్కువ ధరకు పొందవచ్చని వివరించారు.
Japan | జపాన్ పర్యటనకు వెళ్లే పర్యాటకులు ఆహారం కోసం చేసే ఖర్చును భారీగా తగ్గించుకోవచ్చని ఓ ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ వెల్లడించారు. అక్కడి సూపర్మార్కెట్లు, కన్వీనియన్స్ స్టోర్లలో సాయంత్రం వేళ తాజా ఆహార పదార్థాలపై భారీ రాయితీలు లభిస్తాయని తెలిపారు. సరైన సమయంలో కొనుగోలు చేస్తే కొన్ని పదార్థాలను 80 శాతం వరకు తక్కువ ధరకు పొందవచ్చని వివరించారు. జపాన్‌లో తాజా కూరగాయలు, చేపలతో తయారుచేసే ఆహారానికి ప్రాధాన్యం ఉండగా, ఈ పద్ధతి పర్యాటకులకు బాగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.
ప్రతి 20 నిమిషాలకు తగ్గే ధరలు..
స్వాతి, ప్రదీప్ అనే ట్రావెల్ ఇన్ఫ్లుయెన్సర్ల జంట జపాన్‌లోని ఓ సూపర్‌మార్కెట్‌ను సాయంత్రం వేళ సందర్శించి తమ అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మూడు రోజుల పాటు సరిపడే తాజా ఆహార పదార్థాల కోసం కేవలం రూ.1,400 మాత్రమే ఖర్చు చేసినట్లు వారు వెల్లడించారు. సాయంత్రం సమయంలో కొన్ని ఉత్పత్తుల ధరలు ప్రతి 20 నిమిషాలకు తగ్గుతాయని స్వాతి వివరించారు. దుకాణం మూసే సమయం దగ్గరపడే కొద్దీ మరింత రాయితీ లభిస్తుందనే ఆశతో వినియోగదారులు అక్కడ బారులు తీరుతారని తెలిపారు.
80 శాతం వరకు డిస్కౌంట్..
సుషీ, కూరగాయలతో కూడిన బెంటో భోజన పెట్టెలు, కేకులు వంటి వివిధ ఆహార పదార్థాలపై ఈ రాయితీలు ఉంటాయి. అదే రోజు తయారుచేసిన తాజా పదార్థాల ప్యాకెట్లపై ప్రత్యేక రాయితీ స్టిక్కర్లు అతికిస్తారు. సాధారణంగా మొదట 20 శాతం తగ్గింపుతో ప్రారంభమయ్యే రాయితీలు, ఆ తర్వాత 30 శాతం, 50 శాతానికి చేరి, దుకాణం మూసే సమయానికి కొన్ని ఉత్పత్తులపై 80 శాతం వరకు పెరుగుతాయి. మిగిలిపోయిన ఆహారాన్ని పారవేయడానికి అయ్యే ఖర్చు కంటే తక్కువ ధరకు విక్రయించడం సూపర్మార్కెట్లకు ప్రయోజనకరంగా ఉండడంతో ఈ విధానాన్ని అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది.
స్టిక్కర్లను గమనించాలి..
జపాన్‌కు వెళ్లే పర్యాటకులు ఈ రాయితీలను గుర్తించేందుకు ప్యాకెట్లపై ఉండే స్టిక్కర్లను జాగ్రత్తగా పరిశీలించాలని స్వాతి సూచించారు. ముఖ్యంగా జపనీస్ భాషలో స్టిక్కర్లను గమనించాలని తెలిపారు. వాటి అర్థం సగం ధర అని, అలాంటి గుర్తులు కనిపిస్తే రాయితీ విభాగంలో ఉన్నట్లేనని వివరించారు. కొంతసేపు వేచి చూస్తే మరింత తగ్గింపు లభిస్తుందేమోనని స్థానికుల మాదిరిగానే వినియోగదారులు కూడా స్టిక్కర్లను పరిశీలిస్తూ కొనుగోళ్లు చేయవచ్చని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Masooda | తిరువీర్ కెరీర్లో ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్.. ‘మసూద’ సినిమాకు 4 ఏళ్లు!
MLA Kova Lakshmi | పింఛన్, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ : ఎమ్మెల్యే కోవలక్ష్మి
ప్రజా సమస్యలకు దిక్కేది?.. మంత్రి ముఖం చాటేయడంపై సర్పంచుల నిరసన
Students | స్కాలర్ షిప్స్ విడుదల చేయాలి.. రోడ్డెక్కిన విద్యార్థినులు.. వీడియో
పొన్నేకల్ వద్ద మినీ వ్యాన్ బోల్తా
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

