Tomato Juice | టమోటా జ్యూస్‌తో చెడు కొలెస్ట్రాల్‌కు చెక్.. మనో ఉల్లాసం కూడా..!
Tomato Juice | చెడు కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయాలంటే ప్రతి రోజూ ఒక గ్లాస్ టామోటా రసం తాగాలని నిపుణులు చెబుతున్నారు.
Tomato Juice | ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితం ఉరుకులు పరుగులే.. దీంతో రోజువారీ జీవనశైలిలోనూ, ఆహార అలవాట్లలోనూ మార్పులతో పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి సమస్యల్లో కొలెస్ట్రాల్ ఒకటి. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల హృద్రోగ సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. గుండెపోటు రావడం గానీ, రక్తనాళం లోపల కొలెస్ట్రాల్ పెరగడం వల్ల శరీరంలోని వివిధ భాగాలకు రక్త ప్రసరణ మందగిస్తుంది. దీంతోపాటు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోవడంతో కండ్లు, చర్మంతోపాటు ఇతర అవయవాలు దెబ్బ తినవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ ను అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం అని వైద్యులు అంటున్నారు. కొలెస్ట్రాల్ నియంత్రణకు రోజువారీగా వ్యాయామం చేయడంతోపాటు మంచి ఆహారం కూడా తీసుకోవాలి.
ఇప్పుడు 30 ఏండ్లలోపు యువత కూడా గుండె పోటు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చాతిలో నొప్పి వస్తూ ఉంటుంది. ఇది ఊబకాయానికి.. అటుపై గుండెపోటుకు దారి తీస్తుంది. ఇటువంటి పరిస్థితులను అధిగమించడానికి ఈ జ్యూస్ చక్కని పరిష్కార మార్గం అని అంటున్నారు. శరీరంలో పెరిగిపోతున్న చెడు కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి టమోటాలు చాలా బాగా ఉపకరిస్తాయని చెబుతున్నారు. టమోటాల్లో ఏ విటమిన్, కాల్షియం, గామ్మా ఎమైనోబుట్ర్యిక్ యాసిడ్ వంటి మినరల్స్ ఉంటాయి. టమోటాల్లో ఉండే నీరు, మినరల్స్ వల్ల.. టమోటాలతో తయారు చేసిన జ్యూజ్ తాగడం వల్ల కొలెస్ట్రాల్ అదుపు చేయొచ్చు. హృద్రోగ సమస్యలు నివారించడంతోపాటు మానసికంగా ఉల్లాసం కలుగుతుందని, ఆరోగ్యం మెరుగవుతుందని వైద్య నిపుణులు అంటున్నారు.
రోజూ ఒక కప్పు టమోటా రసం తాగితే శరీరంలో పది శాతం కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయొచ్చు. టమోటాలోని యాంటీ యాక్సిడెంట్ ‘లైకోపిన్’.. కొలెస్ట్రాల్ ను కంట్రోల్ చేయడంలో బాగా ఉపకరిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. ఒక రోజు 25 మి.గ్రా కంటే ఎక్కువ లైకోఫిన్ తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతోపాటు మంచి కొలెస్ట్రాల్ కూడా పెరుగుతుందని ఆ అధ్యయనం సారాంశం. కొన్ని టమోటాలు, నీటిని కలిపి మిక్స్ చేసి తాగాలి. అందులో ఉప్పు గానీ, చక్కెర గానీ కలుపకుండా తాగాలి. టమోటా సూప్ చేసుకుని తాగితే చాలా మంచిదని వైద్య నిపుణులు అంటున్నారు.
ఇవి కూడా చదవండి :
Oppo Reno 12F 5G | ఒప్పో ప్రీమియం ఫోన్ ఒప్పో రెనో 12ఎఫ్ 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..!
World Bank | గ్రీన్ ఎనర్జీ కోసం భారత్‌కు ప్రపంచ బ్యాంకు 150 కోట్ల డాలర్ల రుణం..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

