Health Tips | ఈ పానీయాలతో కొలెస్ట్రాల్‌కు చెక్!
గుండె ఆరోగ్యానికి ముప్పు కలిగించే కారకాల్లో అధిక కొవ్వు ముందువరసలో నిలుస్తుంది. హృద్రోగ ముప్పును నివారించేందుకు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను సరైన రీతిలో ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొవ్వు పేరుకుపోకుండా నిత్యం వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.
న్యూఢిల్లీ : గుండె ఆరోగ్యానికి ముప్పు కలిగించే కారకాల్లో అధిక కొవ్వు ముందువరసలో నిలుస్తుంది. హృద్రోగ ముప్పును నివారించేందుకు కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను సరైన రీతిలో ఉండేలా చూసుకోవాలి. రక్తంలో కొవ్వు పేరుకుపోకుండా నిత్యం వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు తక్కువ సమయంలోనే కొన్ని పానీయాలను కూడా చేసుకుని తీసుకోవడం మేలని నిపుణులు సూచిస్తున్నారు.
టమాట జ్యూస్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపకరిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. సలాడ్స్‌తో పాటు వంటకాల్లో కలిపి, పచ్చిగా కూడా టమాటాలను వాడుతుంటారు. టమాట జ్యూస్ తరచూ తీసుకోవడం ద్వారా శరీరంలో కొవ్వును తగ్గించవచ్చు. టమాట జ్యూస్‌లో ఉండే లికోపిన్ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది.
ఇక యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే గ్రీన్ టీతో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను ఆరోగ్యకరంగా ఉంచడంతో పాటు బరువు తగ్గడం, రోగనిరోధక వ్యవస్ధను మెరుగుపరచడం వంటి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు గ్రీన్‌టీతో కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సీ కూడా గ్రీన్‌టీలో తగినంత మోతాదులో లభిస్తుంది. యాంటీఆక్సిడెంట్లు కలిగిన డార్క్ చాకొలేట్తో కూడిన చాక్లెట్ డ్రింకులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇక ప్లాంట్ బేస్డ్ మిల్క్‌లో బెర్రీస్‌ను కలిపిన పానీయం తీసుకుంటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

