Protein Foods | రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినండి.. రోజంతటికీ కావల్సిన శక్తి లభిస్తుంది..
మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాల విషయానికి వస్తే ప్రోటీన్లు కూడా ముఖ్యమైనవే. ఇవి మన శరీరానికి శక్తిని అందించడంతోపాటు కణాల మరమ్మత్తులకు ఉపయోగపడతాయి.
Protein Foods | మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ అన్ని రకాల పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. పోషకాల విషయానికి వస్తే ప్రోటీన్లు కూడా ముఖ్యమైనవే. ఇవి మన శరీరానికి శక్తిని అందించడంతోపాటు కణాల మరమ్మత్తులకు ఉపయోగపడతాయి. కనుక ఉదయం తీసుకునే బ్రేక్‌ఫాస్ట్‌లో ప్రోటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని పోషకాహార నిపుణులు సైతం చెబుతుంటారు. ప్రోటీన్లు అనగానే మనకు నాన్ వెజ్ వంటకాలే గుర్తుకు వస్తాయి. అయితే ఇవే కాదు, ఇంకా అనేక ఆహారాల ద్వారా మనం ప్రోటీన్లను పొందవచ్చు. ఇక నాన్‌వెజ్ తిననివారు కూడా పలు శాకాహారాల ద్వారా ప్రోటీన్లను పొందవచ్చు. ప్రోటీన్లు ఉదయమే అందేలా చూసుకుంటే దాంతో రోజంతా శరీరానికి కావల్సిన శక్తి లభిస్తుంది. ఉత్సాహంగా పనిచేస్తారు. ప్రోటీన్లు మనకు పలు ఆహారాల్లో లభిస్తాయి.
స్మూతీలు..
స్మూతీలను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రోటీన్లను సమృద్ధిగా పొందవచ్చు. బ్రాండ్‌ను బట్టి యావరేజ్‌గా 100 గ్రాముల ప్రోటీన్ పౌడర్‌ను స్మూతీ ద్వారా తీసుకుంటే సుమారుగా 70 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. ఉదయం స్మూతీ తాగాలని అనుకునేవారు అందులో ప్రోటీన్ పౌడర్‌తోపాటు పండ్లు, పాలకూర, పాలు వంటి ఆహారాలను చేర్చుకుంటే మంచిది. దీంతో ఇతర పోషకాలను కూడా పొందవచ్చు. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే క్వినోవాను రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటున్నా కూడా ప్రోటీన్లు సమృద్ధిగానే లభిస్తాయి. సుమారుగా 100 గ్రాముల క్వినోవాను తింటే 8 గ్రాముల మేర ప్రోటీన్లు లభిస్తాయి. అలాగే క్వినోవా ద్వారా ఇతర పోషకాలను కూడా పొందవచ్చు. దీంతో కడుపు నిండిన భావన కలుగుతుంది. అధిక బరువు తగ్గేందుకు క్వినోవా ఎంతగానో సహాయపడుతుంది.
బాదంపప్పు..
బాదంపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు ప్రోటీన్లు కూడా సమృద్ధిగానే ఉంటాయి. 100 గ్రాముల బాదం పప్పు ద్వారా సుమారుగా 21 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. బాదంపప్పులను రాత్రిపూట నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం పొట్టు తీసి తింటే మంచిది. వీటిని స్మూతీల్లో కూడా కలిపి తీసుకోవచ్చు. అదేవిధంగా ప్రోటీన్ల కోసం పీనట్ బటర్‌ను కూడా ఆహారంలో భాగం చేసుకోవచ్చు. దీన్ని సలాడ్స్‌పై చల్లి తినవచ్చు. 100 గ్రాముల పీనట్ బటర్లో సుమారుగా 25 గ్రాముల మేర ప్రోటీన్లు ఉంటాయి. అలాగే చియా విత్తనాలను తీసుకుంటున్నా కూడా ప్రోటీన్లు సమృద్ధిగానే లభిస్తాయి. 100 గ్రాముల చియా విత్తనాల ద్వారా సుమారుగా 17 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. ఈ విత్తనాల ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా లభిస్తాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అధిక బరువును తగ్గిస్తాయి. కంటి చూపును మెరుగు పరుస్తాయి.
పనీర్..
పనీర్ అంటే చాలా మందికి ఇష్టమే. దీన్ని తరచూ వంటల్లో వేస్తుంటారు. పలు బిర్యానీ వంటకాలు లేదా మసాలా వంటకాల్లో పనీర్‌ను వేస్తుంటారు. వాస్తవానికి పనీర్‌ను తరచూ తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల పనీర్‌ను తింటే 18 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. పనీర్ ద్వారా మనకు క్యాల్షియం కూడా సమృద్ధిగానే లభిస్తుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ ఒక కోడిగుడ్డును తినడం ద్వారా కూడా ప్రోటీన్లు లబిస్తాయి. 100 గ్రాముల గుడ్లను తింటే సుమారుగా 13 గ్రాముల మేర ప్రోటీన్లను పొందవచ్చు. ఇలా పలు రకాల ఆహారాలను తీసుకోవడం వల్ల ప్రోటీన్లు లభిస్తాయి. దీంతో శరీరానికి రోజంతా కావల్సిన శక్తి అందుతుంది. దీని వల్ల ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- protein foods
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్‌లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్‌బండ్‌పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

