గొంతులో గరగరా?
చలికాలంలో గొంతునొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. చాలా సందర్భాల్లో వంటింటి చిట్కాలతోనే సమస్య తగ్గిపోతుంది.
చలికాలంలో గొంతునొప్పి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. చాలా సందర్భాల్లో వంటింటి చిట్కాలతోనే సమస్య తగ్గిపోతుంది. కొన్నిసార్లు మందులు వాడినా మొండికేస్తుంది. తగిన జాగ్రత్తలతో.. సులభంగానే వదిలించుకోవచ్చు.
నొప్పి, ఎండిపోయినట్టు ఉండటం, గరగర.. గొంతునొప్పి లక్షణాలు. ఈ సమస్య మూడు రకాలు. ఒకటి- నోటి వెనకభాగంలోని గవద(టాన్సిల్స్)ల్లో సున్నితమైన కణజాలానికి వాపు వచ్చి, ఎర్రరంగులోకి మారే టాన్సిలైటిస్; గొంతులో నొప్పి, గొంతువాపు ప్రధానంగా కనిపించే ఫెరింజైటిస్; స్వరపేటిక (లెరింక్స్)లో వాపు, నొప్పి ఇబ్బందిపెట్టే లెరింజైటిస్. ప్రధానంగా ఈ ఇబ్బంది జలుబు, దగ్గు వల్ల వస్తుంది. ధూమపానం, ఎయిర్ ఫ్రెష్నర్స్ స్ప్రేల కారణంగా కూడా రావచ్చు. గాలి నాణ్యతలో తేడా వచ్చినా ఇబ్బందే. పరాగ రేణువులు, గడ్డి, పెంపుడు జంతువుల బొచ్చు విదిలించడం వల్ల ఎగిసిపడే చర్మ కణాలు అలర్జీకి గురిచేసి.. ఇన్ఫెక్షన్కు దారితీస్తాయి. ఎడతెరపి లేకుండా అరవడం, కూతలు పెట్టడం వల్ల కూడా ఇలా జరగవచ్చు. స్వరతంత్రుల్లో, గొంతు కండరాల్లో సమస్యల వల్ల కొన్నిసార్లు గొంతు బొంగురుపోతుంది. అది గొంతువాపునకు దారితీస్తుంది. స్ట్రెప్టోకోకస్ బ్యాక్టీరియా ద్వారా ఒకరినుంచి ఒకరికి ఈ ఇన్ఫెక్షన్ సోకుతుంది.
చిట్కాలతో సరి..
చాలా సందర్భాల్లో ఎలాంటి చికిత్సా అవసరం ఉండదు. ఉప్పు వేసిన వేడినీటిని బాగా పుక్కిలించడం, వేడివేడి సూప్, తేనె కలిపిన టీ తాగడం, గొంతు బాగయ్యే వరకు మాటలు తగ్గించడం.. తదితర చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. దిగువ తెలిపిన లక్షణాలు కనుక ఉంటే, వెంటనే డాక్టర్ను సంప్రదించాలి..
- గొంతు వాపు ఎక్కువగా ఉండటం.
- మెడ నొప్పి, మెడ కదిలించడంలో ఇబ్బంది.
- నోరు తెరవడంలో సమస్య.
- తీవ్ర జ్వరం.
- ఉమ్మిలో, తెమడలో రక్తం.
- మాట్లాడలేని పరిస్థితి.
నిర్ధారణ ఇలా..
రోగి గొంతు, చెవులు, ముక్కు రంధ్రాలను డాక్టర్ క్షుణ్నంగా పరీక్షిస్తారు. ఉబ్బిన శోష రస గ్రంథుల వాపు తగ్గేందుకు మెడ భాగంలో సున్నితంగా రుద్దుతారు. అవసరమైతే.. థ్రోట్ కల్చర్ పరీక్ష కోసం గొంతు వెనకభాగం నుంచి కొంత నమూనాను తీసుకుంటారు. దానిని ప్రయోగశాలకు పంపిస్తారు. ర్యాపిడ్ టెస్ట్ అయితే నిమిషాల వ్యవధిలోనే ఫలితం తేలిపోతుంది.
జాగ్రత్తలతో దూరం..
వైరల్ ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గడానికి ఐదు నుంచి ఏడురోజుల సమయం పడుతుంది. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి. చేతులను సబ్బుతో తరచుగా కడుక్కోవడం, గొంతు వాపుతో ఇబ్బందిపడుతున్నవారికి దూరంగా ఉండటం, ధూమపానాన్ని వదిలిపెట్టడం, గాలి కాలుష్యం బారినపడకుండా చూసుకోవడం తదితర జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రంగా మారవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

