పాదాలకు రక్ష..
జీవితకాలంలో మనం సగటున భూమి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసినంత దూరం నడుస్తామట. ఆ నడకలో పాదరక్షలే మనకు రక్ష. కానీ, మనం వాటి బాగోగులు పట్టించుకోం. వాకింగ్, రన్నింగ్, జిమ్.. ఇలా సకల అవసరాలకూ ఒకే జత వాడేస్తుంటాం. ఇప్పటికైనా, సందర్భానికి తగిన షూస్ ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
జీవితకాలంలో మనం సగటున భూమి చుట్టూ ఐదు ప్రదక్షిణలు చేసినంత దూరం నడుస్తామట. ఆ నడకలో పాదరక్షలే మనకు రక్ష. కానీ, మనం వాటి బాగోగులు పట్టించుకోం. వాకింగ్, రన్నింగ్, జిమ్.. ఇలా సకల అవసరాలకూ ఒకే జత వాడేస్తుంటాం. ఇప్పటికైనా, సందర్భానికి తగిన షూస్ ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
నడక కోసం వాకింగ్ షూస్ మాత్రమే వాడాలి. అప్పుడే పాదాలు, వాటికి అనుసంధానమైన కీళ్లు ‘బయోమెకానిక్స్’కు తగినట్టుగా ఉంటాయి. వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పులు, పాదాల నొప్పులు, మెడనొప్పి, తలనొప్పి తదితర సమస్యలకు మన పాదరక్షలూ ఓ కారణం కావచ్చు. సరైన కొలతతో, పాదాలకు తగినట్టు ఉండే షూస్ కాలికి గాయాలు కాకుండా చూస్తాయి. అలా మన ఫిట్‌నెస్‌కు ఆధారంగా నిలుస్తాయి. వాహనంలో నాణ్యమైన ఇంధనం వాడకపోతే ఇంజిన్ పాడైపోతుంది. అలాగే సరైన షూస్ లేకపోతే శరీరం కూడా నొప్పులకు లోనవుతుంది. నాణ్యమైన షూస్ సౌకర్యవంతంగానూ ఉంటాయి.
మనం ఏదైనా నొప్పితో వెళ్లినప్పుడు.. వైద్యులు మొదట మన అరికాలును, మన షూస్‌ను పరీక్షిస్తారు. సరైన పాదరక్షలు ధరిస్తే 30 నుంచి 40 శాతం సమస్యలు దూరం అవుతాయి. వాకింగ్ షూస్‌ను ప్రతి ఐదొందల కిలోమీటర్లకూ మార్చుకోవాలి. హైహీల్స్ వల్ల వెన్నునొప్పి, తలనొప్పి, పాదాలకు గాయాలు, బెణుకులు, మడమల సమస్యలు ఎదురవుతాయి. ఉదయంతో పోలిస్తే సాయంత్రానికి మన పాదాలు కొంచెం పెద్దగా కనిపిస్తాయి. కాబట్టి, పాదరక్షల షాపింగ్ సాయంత్రమే మంచిది. అలాగే, షూస్ కొనేటప్పుడు నిలబడి పాదాల సైజును చూసుకోవడమే ఉత్తమం.

Shoes 4
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- Foot health
- footwear
- Shoes
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

