బిగ్‌బాస్ ఫేమ్ షెహనాజ్ గిల్ వెయిట్‌లాస్ సీక్రెట్ ఇదే!!
హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 అంటేనే అందరికీ గుర్తొచ్చే పేరు షెహనాజ్ గిల్. మోడల్, సింగర్, నటి అయిన హెహనాజ్ ఈ షోలో సందడి చేసింది. అయితే, ఈ షోలో ఆమె చాలా లావుగా ఉండేది. బిగ్‌బాస్ షో తర్వాత కొద్దిరోజులకే నాజూగ్గా మారిపోయింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. శిల్పాశెట్టి నిర్వహించే 'షేప్ ఆఫ్ యూ'లో వెయిట్‌లాస్ సీక్రెట్స్‌ను వివరించింది.
హిందీ బిగ్‌బాస్ సీజన్ 13 అంటేనే అందరికీ గుర్తొచ్చే పేరు షెహనాజ్ గిల్. మోడల్, సింగర్, నటి అయిన హెహనాజ్ ఈ షోలో సందడి చేసింది. అయితే, ఈ షోలో ఆమె చాలా లావుగా ఉండేది. బిగ్‌బాస్ షో తర్వాత కొద్దిరోజులకే నాజూగ్గా మారిపోయింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. శిల్పాశెట్టి నిర్వహించే ‘షేప్ ఆఫ్ యూ’లో వెయిట్‌లాస్ సీక్రెట్స్‌ను వివరించింది.
బరువు తగ్గేందుకు ఇంటినుంచి బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని, పర్సనల్ ట్రైనర్ కూడా అవసరం లేదని షెహనాజ్ గిల్ పేర్కొంది. ఆహారంలో స్వల్ప మార్పులు చేసుకుంటే చాలు మంచి ఫిట్నెస్ సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఫిట్నెస్ సాధించాలంటే ముందు అందుకోసం మనసును సంసిద్ధం చేసుకోవాలని పేర్కొంది. శారీరక దృఢత్వం సాధించాలంటే ముందు మానసిక దృఢత్వం సాధించాలని సూచించింది.
షెహనాజ్ వెయిట్ లాస్ ప్లాన్‌లో 70శాతం డైట్ ప్లానే. అందరి దినచర్య టీ లేదా పసుపు పాలు, తేనె నీటితో ప్రారంభమైతే ఆమె మాత్రం ప్రతిరోజూ ఉదయం ఆపిల్ సైడర్ వెనిగర్ తాగేది. అల్పాహారంలో ప్రొటీన్స్ ఎక్కువగా ఉండేలా చూసుకునేది. మెంతి పరోటా, మొలకెత్తిన విత్తనాలు, దోస ఇలా ఏదో ఒకటి పెద్దమొత్తంలో తినేది. ఇదే షెహనాజ్ వెయిట్‌లాస్ జర్నీలో కీలకం.
హెహనాజ్ వెయిట్‌లాస్ డైట్‌ప్లాన్‌లో నీటిది ప్రధాన పాత్ర..కేవలం 30శాతం మాత్రమే ఆహారం తీసుకొని, మిగతా 70 శాతం కడుపును నీటితో నింపేసేది. అయితే, అంత మొత్తంలో నీటిని తాగడం కొందరికి ఇష్టముండదని, అలాంటివారు పండ్లు కలిపిన నీటిని తాగొచ్చని షెహనాజ్ సూచించింది. అలాగే, ఈ జర్నీలో ఎన్నో అడ్డంకులు వస్తాయని తెలిపింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగాలని పేర్కొంది. బరువు తగ్గాలనే బలమైన సంకల్పం ఉండాలని, అప్పుడే కోరికలను జయిస్తారని తెలిపింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

