Rheumatoid Arthritis | కీళ్ల నొప్పులా.. అయితే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి తెలుసుకోవాల్సిందే
Rheumatoid Arthritis | రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీవ్రమైన కీళ్లవ్యాధి.మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కీళ్ల కణజాలం మీద దాడి చేయడం వల్ల దాపురించే ఆటోఇమ్యూన్ రుగ్మత. దీనివల్ల కీళ్ల కణజాలంలో వాపు సంభవిస్తుంది. కీళ్లు అతి సున్నితంగా మారి పోతాయి.
Rheumatoid Arthritis | రుమటాయిడ్ ఆర్థరైటిస్ తీవ్రమైన కీళ్లవ్యాధి.మన శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ ఆరోగ్యకరమైన కీళ్ల కణజాలం మీద దాడి చేయడం వల్ల దాపురించే ఆటోఇమ్యూన్ రుగ్మత. దీనివల్ల కీళ్ల కణజాలంలో వాపు సంభవిస్తుంది. కీళ్లు అతి సున్నితంగా మారి పోతాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ చాలావరకు రోగ నిరోధక వ్యవస్థ వైఫల్యం వల్లే వస్తుంది. జన్యుపరంగా, జీవక్రియల కారణంగా కూడా వచ్చే ఆస్కారం ఉంది. వ్యాధి తొలిదశలో ఉన్నప్పుడే రోగ నిర్ధారణ చేయించుకుని, తగిన చికిత్స తీసుకుంటే త్వరగా కోలుకుంటారు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ పట్ల అవగాహన లేకపోవడంతో చాలామంది, తొలినాళ్లలో దీన్ని సాధారణమైన కీళ్లనొప్పిగా పొరబడతారు. పెయిన్కిల్లర్లు, ఆయింట్‌మెంట్లతో కాలం వెళ్లదీస్తారు. తగిన చికిత్స అందకపోవడంతో రోజురోజుకూ రోగం ముదిరిపోతుంది. కొన్నాళ్లకు రోజువారీ కార్యకలాపాల మీద కూడా ప్రభావం పడుతుంది. చికిత్స విషయానికొస్తే.. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌కు రుమటాల జిస్టులు చికిత్స చేస్తారు. రుమటాలజీ అనేది వైద్యశాస్త్రంలో అత్యాధునికమైన విభాగం.
రోగులు సాధారణంగా కీళ్లనొప్పుల వైద్యుడైన ఆర్థోపెడీషియన్ దగ్గరికో, జనరల్ ఫిజీషియన్ దగ్గరికో వెళ్తారు. పెద్ద దవాఖానల్లో మాత్రమే రుమటాలజిస్టులు కనిపిస్తారు. నిజానికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వ్యాధి కాదు. అది శరీరంలో పేరుకుపోయిన నిర్దిష్ట సమస్య తాలూకు ఓ లక్షణం. చికిత్స ఆలస్యమయ్యేకొద్దీ ముప్పు పెరిగిపోతుంది. కొన్నిసార్లు రోగులు సాధారణ స్థితికి చేరుకోడానికి.. నాలుగు నుంచి ఆరేండ్ల సమయం పడుతుంది.
స్త్రీలలోనే ఎక్కువ
పాతికేండ్ల క్రితంతో పోలిస్తే పరిస్థితులు మారిపోయాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నవారిలో ప్రాథమిక లక్షణాలు కనిపించినా.. ఐదు నుంచి పదేండ్లకు పూర్తిగా జబ్బుపడేవారు. కదలికలు భారమై నాలుగు గదులకే పరిమితమైపోయేవారు. అలా జీవితం ముగిసిపోయిందనే అనుకునేవారు. ఒకవేళ 30లలో ఉన్న మహిళలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ బారినపడితే ఆ కుటుంబాల పరిస్థితి అగమ్యగోచరమే.
అంతేకాదు, ఆటో ఇమ్యూన్ వ్యాధుల ముప్పు స్త్రీలకే ఎక్కువ. కాగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, వాస్కులైటిస్ లాంటి ఆటో ఇమ్యూన్ రుగ్మతలు వయసు, లింగంతో సంబంధం లేకుండా ఎవరికైనా వస్తాయి. లూపస్ సాధారణంగా మహిళల్లో అధికం. యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీతో ముడిపడిన లూపస్ కారణంగా తరచూ గర్భస్రావం జరుగుతుంది. లూపస్‌ను పూర్తిగా నియంత్రించ లేకపోయినా, తొలిదశలోనే గుర్తించి, తగిన చికిత్స అందిస్తే రోగులు ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చు.
హలో డాక్టర్!
ఉన్నట్టుండి మొదలైన కీళ్ల నొప్పులు రోజుల తరబడి పీడిస్తున్నప్పుడు, వారాల తరబడి కీళ్లలో వాపు కనిపించడం, ఒకటి కంటే ఎక్కువ కీళ్లు సమస్యగా మారినప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. కీళ్ల మధ్య కార్టిలేజ్ తగ్గిపోయినప్పుడు, సైనోవియల్ పొర వాచిపోయి నొప్పిగా ఉన్నప్పుడు, ఎముకలు క్షయం చెందినప్పుడు.. ప్రధానంగా కీళ్ల నొప్పులు వస్తాయి. రక్త పరీక్ష (ఈఎస్ఆర్, ఏఎన్ఏ పరీక్ష, రుమటాయిడ్ ఫ్యాక్టర్, సీసీపీ యాంటీబాడీ టెస్ట్), ఎక్స్- రే, అల్ట్రాసౌండ్, కీళ్ల ఎంఆర్ఐ పరీక్షల ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను నిర్ధారిస్తారు.
తొలి దశలోనే చికిత్స తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మందుల ఖర్చులు కూడా తగ్గుతాయి. మోకాలు, తుంటి, ఎల్బో, భుజం లాంటి చోట్ల కీళ్లు ఆర్థరైటిస్ కారణంగా క్షీణించిపోతే పూర్తిగా కోలుకోవడానికి కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అవసరం అవుతుంది. కీళ్ల నొప్పులు ఉన్నవాళ్లు తాజా పండ్లు, కూరగాయలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న సమతులాహారం తీసుకోవాలి. జంక్‌ఫుడ్‌ను పూర్తిగా పక్కనపెట్టేయాలి. బరువు తగ్గడం మీద దృష్టిసారించాలి. అయితే, లక్షణాలు కనిపించవు కాబట్టి, చాలామంది వ్యాధి ముదిరిన తర్వాతే దవాఖానకు వెళ్తున్నారు. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ గురించి సరైన అవగాహన ఉంటే నిర్ధారణ, చికిత్స సరైన సమయంలో చేయించుకోవచ్చు. జీవన నాణ్యత మరింత పెంచుకోవచ్చు.
సాధారణ లక్షణాలు
- నొప్పి
- పట్టేసినట్టు ఉండటం
- వాపు
- ఎర్రగా కందిపోవడం
- కదలిక ఇబ్బందిగా మారడం
చికిత్స
- స్టెరాయిడ్స్
- టార్గెటెడ్ థెరపీ
- ఫిజియో థెరపీ
- డిఫార్మిటీ కరెక్షన్ సర్జరీ
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

