Health Tips | సైకిల్ సవారీతో కుంగుబాటు పరార్!
పాల ప్యాకెట్ తేవడానికి బైక్, కూరగాయలు తీసుకురావడానికి కారు తీస్తున్నాం. ఊళ్లో ఉన్న చుట్టాల ఇంటికి వెళ్లాలన్నా ఆటో బుక్ చేస్తున్నాం. రవాణా సౌకర్యాలు మెరుగవ్వడంతో సైకిల్ సవారీని మర్చిపోయారంతా! మరోవైపు ఇంధన వినియోగం పెరగడంతో పర్యావరణానికీ ముప్పు తప్పడం లేదు.
Health Tips | పాల ప్యాకెట్ తేవడానికి బైక్, కూరగాయలు తీసుకురావడానికి కారు తీస్తున్నాం. ఊళ్లో ఉన్న చుట్టాల ఇంటికి వెళ్లాలన్నా ఆటో బుక్ చేస్తున్నాం. రవాణా సౌకర్యాలు మెరుగవ్వడంతో సైకిల్ సవారీని మర్చిపోయారంతా! మరోవైపు ఇంధన వినియోగం పెరగడంతో పర్యావరణానికీ ముప్పు తప్పడం లేదు. అయితే, సైక్లింగ్ పరిసరాలకు మాత్రమే కాదు మన మానసిక ఆరోగ్యానికి కూడా ఉపకరిస్తుందని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. చిన్నచిన్న పనులకు ఇతర వాహనాల మీద వెళ్లే వాళ్లతో పోలిస్తే.. సైకిల్ సవారీ చేసే వ్యక్తుల విషయంలో ఆందోళన, కుంగుబాటు చికిత్సకు సూచించే మందుల మోతాదు తక్కువగా ఉంటుందని ఈ పరిశోధన నిరూపించింది. ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎపిడెమియాలజీ’లో ఈ పరిశోధన ప్రచురితమైంది. రీసెర్చ్లో భాగంగా స్కాట్లాండ్కు చెందిన
16 74 మధ్య వయస్కులైన 3,78,253 మందికి సంబంధించిన ఐదేండ్ల సమాచారాన్ని విశ్లేషించారు. ఇల్లు, పని ప్రదేశాల మధ్య సైకిల్ ప్రయాణం.. మానసిక ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గిస్తుందని గుర్తించారు. అయితే, పరిశోధనకు ఎంచుకున్న వారిలో చాలామంది ఇల్లు, పని ప్రదేశం ఒక కిలోమీటర్ పరిధిలో ఉండటం గమనార్హం. ఇలా ఉంటే అధ్యయనం మొదలుపెట్టే నాటికి వీరిలో ఎవ్వరికీ మానసిక సమస్యలు లేవట. ఐదేండ్ల తర్వాత కుంగుబాటు, ఆందోళనకు మందులు తీసుకునే అవసరం మిగిలిన వాళ్లతో పోలిస్తే సైకిల్ మీద వెళ్లేవాళ్లకు 15 శాతం తక్కువగా ఉన్నట్టు తేలింది. మొత్తంగా సైక్లింగ్తో శారీరక వ్యాయామంతోపాటు మానసిక బలం కూడా చేకూరుతుందని పరిశోధన సారాంశం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

