Plastic Bottles | ప్లాస్టిక్ బాటిళ్లలో నీళ్లు తాగుతున్నారా..? అయితే ఈ ముప్పు తప్పదు..!
Plastic Bottles | పనిమీద బయటికి వెళ్తాం. దారిలో ఎక్కడో దాహమేస్తుంది. వెంటనే మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కున్ని దాహార్తి తీర్చుకుంటాం. అయితే, ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లలో వేలకొద్ది అతిసూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. కంటికి కనిపించని ఈ ప్లాస్టిక్ రేణువులు మన ఆరోగ్యానికి నష్టం చేస్తాయని తెలిపింది.
Plastic Bottles | పనిమీద బయటికి వెళ్తాం. దారిలో ఎక్కడో దాహమేస్తుంది. వెంటనే మినరల్ వాటర్ బాటిల్ కొనుక్కున్ని దాహార్తి తీర్చుకుంటాం. అయితే, ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లలో వేలకొద్ది అతిసూక్ష్మమైన ప్లాస్టిక్ రేణువులు ఉంటాయని తాజా అధ్యయనం ఒకటి హెచ్చరించింది. కంటికి కనిపించని ఈ ప్లాస్టిక్ రేణువులు మన ఆరోగ్యానికి నష్టం చేస్తాయని తెలిపింది.
అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం నిర్వహించిన ఈ అధ్యయనం ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్’ జర్నల్‌లో ప్రచురితమైంది. ఇక బాటిళ్లలోని నీటిలో ప్లాస్టిక్ రేణువులను గుర్తించడానికి స్టిమ్యులేటెడ్ రామన్ స్కాటరింగ్ మైక్రోస్కోపీని ఉపయోగించారు. తమ అధ్యయనం కోసం పరిశోధకులు మూడు ప్రముఖ వాటర్ బ్రాండ్లను ఎంచు కున్నారు. ప్లాస్టిక్ రేణువులను 100 నానో మీటర్ల వరకు విభజించుకుని విశ్లేషించారు.
ఒక లీటరు నీళ్లలో 1,10,000 నుంచి 3,70,000 వరకు రేణువులు ఉన్నట్టు గుర్తించారు. వీటిలో 90 శాతం నానోప్లాస్టిక్ అయితే, మిగిలినవి అంతకంటే పెద్దవైన మైక్రోప్లాస్టిక్ రేణువులు. ఇంతకు ముందు అంచనాలతో పోలిస్తే ఈ సంఖ్య పది నుంచి వంద రెట్లు ఎక్కువ. మైక్రోప్లాస్టిక్‌తో పోలిస్తే నానోప్లాస్టిక్ కణాలు మన పేగులు, ఊపిరి తిత్తుల ద్వారా నేరుగా రక్తంలో కలిసి పోతాయి. రక్తం ద్వారా గుండె, మెదడు తదితర అవయవాలకు చేరుకుంటాయి. కణాల్లోకి నేరుగా కూడా చొచ్చుకుపోతాయి. గర్భిణి బొడ్డుతాడు నుంచి కడుపులో ఉన్న పిల్లల శరీరాలకూ చేరుకుంటాయి.
‘ఇంతకుముందు ఇదో బ్రహ్మపదార్థం (డార్క్ ఏరియా). అయితే, టాక్సిసిటీ అధ్యయనాలు బాటిళ్లలో ఏముందనే గుట్టువిప్పే ప్రయత్నం చేస్తున్నాయి” అంటారు కొలంబియా విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ రసాయన శాస్త్రవేత్త బీజాన్ యాన్. మొత్తానికి, ఇప్పటివరకు మనకు తెలియని ప్రపంచాన్ని గమనించడానికి ఈ పరిశోధన తలుపులు తెరుస్తుందని ఆయన పేర్కొన్నారు. కాకపోతే, నోరు పిడచకట్టుకుపోతుంటే మాత్రం.. ఇవన్నీ పక్కనపెట్టి అందుబాటులో ఉన్న మంచినీళ్లు తాగే
యాలని పరిశోధకులు సూచించారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
Amit Shah | కాంగ్రెస్ పార్టీ మరో 30 ఏళ్లు అధికారంలోకి రాదు.. రాహుల్ గాంధీపైనా అమిత్ షా విమర్శలు
Teja Sajja | పెళ్లిపీటలు ఎక్కబోతున్న ‘హనుమాన్’ హీరో తేజ సజ్జ.. ఉదయ్‌పూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

