Home
Health
Obese People Is Increasing And In Doing So They Are Bringing Unnecessary Health Problems Upon Themselves
కొవ్వు మాత్రమే కరగాలంటే
ప్రస్తుత రోజుల్లో ఊబకాయులు పెరుగుతున్నారు. లేనిపోని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గడం కోసం.. డైటింగ్, వ్యాయామాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో భాగంగా చాలామంది కొవ్వుతోపాటు కండరాల క్షీణతబారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత రోజుల్లో ఊబకాయులు పెరుగుతున్నారు. లేనిపోని ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో బరువు తగ్గడం కోసం.. డైటింగ్, వ్యాయామాన్ని ఆశ్రయిస్తున్నారు. అయితే, ఈ ప్రక్రియలో భాగంగా చాలామంది కొవ్వుతోపాటు కండరాల క్షీణతబారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. దీనిని నివారించి, కేవలం కొవ్వును మాత్రమే కరిగించుకోవడానికి కొన్ని పద్ధతులు పాటించాలని సూచిస్తున్నారు.
- కండరాలు క్షీణించకుండా ఉండాలంటే.. తగినంత ప్రొటీన్ తీసుకోవాలి. ఇది కండరాల మరమ్మతుకు, పెరుగుదలకు సహాయపడుతుంది. శరీర బరువులో ప్రతి కేజీకి కనీసం 1.2 గ్రా. నుంచి 1.6 గ్రా. ప్రొటీన్ తీసుకోవాలి. ఇందుకోసం గుడ్లు, పప్పు ధాన్యాలు, పనీర్, సోయా, చికెన్ బ్రెస్ట్, చేపలు ఆహారంలో భాగం చేసుకోవాలి.
- వ్యాయామంలో కేవలం కార్డియో (నడక, పరుగు) మాత్రమే చేస్తే.. కండరాలు కరిగే అవకాశం ఉంది. అలాకాకుండా ఉండాలంటే.. వారానికి 3-4 రోజులైనా, బరువులు ఎత్తడం, బాడీ వెయిట్ లాంటి వ్యాయామాలు చేయాలి. దీనివల్ల మెదడుకు ‘కండరాలు అవసరం’ అనే సంకేతం అందుతుంది.
- త్వరగా బరువు తగ్గాలనే ఆరాటంతో కొందరు ఆహారం చాలా తక్కువగా తీసుకుంటారు. దీనివల్ల శరీరం శక్తి కోసం కండరాలను కరిగించడం మొదలుపెడుతుంది. కాబట్టి, రోజువారీ అవసరం కంటే కేవలం 300-500 కేలరీలు తక్కువగా తీసుకుంటే సరిపోతుంది.
- నిద్రలోనే కండరాల నిర్మాణం వేగంగా సాగుతుంది. కాబట్టి, రోజుకు 7-8 గంటల గాఢ నిద్ర పోవాలి. అప్పుడే
కండరాల క్షీణత తగ్గుతుంది. - ఇక ఒకేసారి అధిక బరువు తగ్గడం కూడా ఆరోగ్యానికి ఏమాత్రం మంచిదికాదు. వారానికి 0.5 నుంచి 1 కేజీ బరువు తగ్గడం ఆరోగ్యకరం. అంతకంటే వేగంగా తగ్గితే కండరాల నష్టానికి దారితీస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

