HomeHealthNutmeg Has Many Medicinal Properties That Reduce Pain
జాజికాయకు జై!
వేల సంవత్సరాల నుంచి వంటకాల్లో జాజి కాయను ఉపయోగిస్తున్నాం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
వేల సంవత్సరాల నుంచి వంటకాల్లో జాజి కాయను ఉపయోగిస్తున్నాం. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. మెగ్నీషియం, మాంగనీస్, క్యాల్షియం, పొటాషియం, కాపర్, విటమిన్- బి1, బి6 కూడా పుష్కలం.
జాజికాయలో నొప్పిని తగ్గించే ఔషధ గుణాలెన్నో ఉన్నాయి. ఒక టేబుల్ స్పూన్ కొబ్బరినూనెలో జాజికాయను నూరి.. వాపు, నొప్పి ఉన్నచోట రాస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఆహారంలో కొంత జాజికాయ పొడి కలిపి తీసుకుంటే జీర్ణ రసాలు చైతన్యవంతం అవుతాయి. అజీర్తి పారిపోతుంది. మలద్వార సమస్యలు, కడుపుబ్బరం దారి కొస్తాయి. జాజికాయలో నాడీ కణాలను రక్షించే గుణాలు కూడా ఉన్నాయి.
జాజికాయ తినడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది. లైంగిక సమస్యల పరిష్కారంలోనూ జాజికాయ పనికొస్తుంది. కాకపోతే, మరీ ఎక్కువగా తింటే హృదయ స్పందనలో తేడాలొస్తాయి.