అమెరికాకు చెందిన పరిశోధక సంస్థ రట్గెర్స్ అధ్యయనం ప్రకారం సాధారణ ప్రజల కంటే ధూమపానం, మద్యపానం వ్యసనపరులనే ఎక్కువశాతం అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయని తేలింది.వీటిలో ప్రమాదకరమైన క్యాన్సర్లు కూడా ఉన్నాయి. మద్యపానం, ధూమపానం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వస్తుందని వైద్యులు హెచ్చరిస్తూ ఉంటారు. కానీ, ఈ దురలవాట్లు శరీరంలో ఇతర అవయవాలపైనా దుష్ప్రభావం చూపుతాయి. వీటిలో అతి ప్రధానమైనవి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు.
ధూమపానం, మద్యపానం ఇప్పుడు ఫ్యాషనైపోయాయి. పైగా చదువుకున్న యువత ఎక్కువగా ఈ దురలవాట్ల బారినపడుతుండటం శోచనీయం. ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం కొంతమంది, సరదా అని చెప్పి ఇంకొంతమంది, మోజుతో మరికొంతమంది పొగాకు, ఆల్కహాలు తీసుకోవడం మొదలుపెడతారు. క్రమంగా వీటికి బానిసలుగా మారిపోతారు. పొగాకు ఉత్పత్తులు, మద్యపానం ఆరోగ్యానికి హానికరమనే సూచనలు ఆయా ఉత్పత్తులపైనే కనిపిస్తున్నప్పటికీ వ్యసనాల ఊబిలో చిక్కుకుపోతుండటం విచిత్రం.
ఊపిరితిత్తుల క్యాన్సర్కు ప్రధాన కారణమైన మద్యపానం, ధూమపానం దురలవాట్లు హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకూ బాటలువేస్తాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువమంది హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల బారినపడుతున్నారు. వీరిలో పురుషులే ఎక్కువగా ఉంటున్నారు. ధూమపానం, మద్యపానం వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం 75శాతం వరకు ఉంటుంది. శరీరంలో తల, శ్వాస, జీర్ణ సంబంధ వ్యవస్థలో ఏర్పడే క్యాన్సర్లను హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా పరిగణిస్తారు.
మద్యపానం, ధూమపానం వల్ల పెదవులు, నోరు, చిగుళ్లు, నాలుక, నాసల్ క్యావిటీ, ఫారింక్స్, స్వరపేటిక వంటి భాగాలలో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. 90శాతం వరకు ఈ క్యాన్సర్లు స్కామస్ సెల్ క్యార్సినోమా రకానికి చెందినవే. అంటే శ్లేష్మం (మ్యూకస్) ఉండి, ఎప్పుడూ తడిగా ఉండే లోపలి పెదాలు, చిగుళ్లు, నాలుక తదితర భాగాలలో ఈ క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తాయి. పొగ తాగడం, పొగాకు ఉత్పత్తులు వాడటం వల్ల క్యాన్సర్ తప్పదని 30 ఏండ్ల కిందటే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. అయినప్పటికీ రోజురోజుకు ధూమపానం, మద్యపానం చేసేవాళ్ల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. దీనికి అనుగుణంగానే క్యాన్సర్ రోగుల సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది.
ఏ భాగాల్లో క్యాన్సర్లు?
నిర్ధారణ పరీక్షలు
పై లక్షణాలు కనిపించినా లేదా ఏమాత్రం అనుమానంగా ఉన్నా వైద్యులను సంప్రదించాలి. వాళ్లు బయాప్సీ, ఎంఆర్ఐ, సీటీ స్కాన్, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ పద్ధతులతో క్యాన్సర్ వచ్చిన ప్రాంతం, దశలను నిర్ధారణ చేస్తారు.
సర్జరీ-థెరపీతో చికిత్స
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల బారినపడకూడదంటే ముందుగా ధూమపానం, మద్యపానం దురలవాట్లను వదిలించుకోవాలి. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధులకు సంబంధించి అత్యాధునిక చికిత్సా పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. అయితే చికిత్స అనేది ప్రధానంగా వ్యాధి దశపై, ఆ తర్వాత వ్యాధి సోకిన భాగంపై ఆధారపడి ఉంటుంది. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లకు చికిత్స రెండు రకాలుగా అందిస్తారు. ఒకటి సర్జరీతో, రెండోది థెరపీలతో.
కొన్నిసార్లు ఈ రెండూ అవసరం కావొచ్చు. రోగి ఆరోగ్య స్థితి ఆధారంగా సర్జరీ, రేడియేషన్, కీమో, టార్గెటెడ్ థెరపితోపాటు కొన్ని రకాల సమ్మేళన థెరపీలను కూడా అవసరాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. తల, మెదడు లాంటి సున్నితమైన భాగాల్లో చికిత్స చేసినప్పుడు, వాటి పనితీరు, ముఖంలో అనేక మార్పులు కనిపిస్తాయి. కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు గొంతులో మార్పు, నమలడానికి ఇబ్బందిపడటం, దవడ ఎముక పట్టేసినట్లు ఉండటం, మొద్దుబారినట్లుగా ఉండటం వంటి మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉంటాయి.
తొలిదశలోనే…
హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వ్యాధులను తొలిదశలోనే గుర్తిస్తే సర్జరీతోనే వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చు. అంటే ఒకటి, రెండు దశల్లోనే వ్యాధిని గుర్తించాల్సి ఉంటుంది. ఆ తరువాత సర్జరీ జరిగిన భాగాన్ని రీకన్స్ట్రక్షన్ చేయాల్సి రావచ్చు. ఇక మూడు, నాలుగు దశలకు చేరుకుంటే సర్జరీతోపాటు కీమో, రేడియేషన్ కూడా అవసరం అవుతాయి. 3డీసీఆర్టీ, వీఎంఏటీ, ఐజీఆర్టీ, ఐజీకేటీ, బ్రాకీథెరపీ, బీమ్థెరపీ లాంటి ఆధునిక పద్ధతులతో రేడియో థెరపీ ద్వారా చికిత్స అందించవచ్చు. ఇక సాధారణంగా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లలో కీమో థెరపీ పాత్ర తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని సందర్భాల్లో మాత్రం కీమోను మిశ్రమ చికిత్సగా అందిస్తారు. ఉపశమనం కోసం పాలియేటివ్ కేర్లోనూ కీమోను ఉపయోగిస్తారు. అయితే చివరి దశతో పోలిస్తే తొలిదశలోనే చికిత్స తీసుకునే వారికి మంచి ఫలితాలు లభించే
అవకాశాలు ఎక్కువ.
లక్షణాలు
..?మహేశ్వర్రావు బండారి
డాక్టర్ చింతమడక , సాయిరామ్
క్లినికల్ ఆంకాలజిస్ట్
ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్