చర్మానికి.. వంటింటి వైద్యం
వంటింట్లో వాడే అనేక దినుసులకు అపారమైన ఔషధ గుణాలున్నాయి. వాటితో చర్మ సంరక్షణ సాధ్యమే. అంతెందుకు? మెంతుల సంగతే తీసుకోండి. గింజలు, బెరడు, ఆకులు.. మెంతుల్లో ప్రతీది చర్మం మీది ముడతలను నివారించే శక్తి కలిగి ఉంటుంది.
వంటింట్లో వాడే అనేక దినుసులకు అపారమైన ఔషధ గుణాలున్నాయి. వాటితో చర్మ సంరక్షణ సాధ్యమే. అంతెందుకు? మెంతుల సంగతే తీసుకోండి. గింజలు, బెరడు, ఆకులు.. మెంతుల్లో ప్రతీది చర్మం మీది ముడతలను నివారించే శక్తి కలిగి ఉంటుంది. మెంతులను మరిగించిన నీళ్లతో ముఖం, మెడ తరచూ కడుక్కున్నా.. మార్పు కనిపిస్తుంది. మెంతులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి జీవక్రియను చైతన్యవంతం చేస్తాయి. కోడిగుడ్డుకు సైతం చర్మ సంరక్షణ శక్తి ఉంది. గుడ్డులో ప్రొటీన్లు అధికం. ఇవి చర్మం ముడతలను నివారించే కొలాజెన్ ఉత్పత్తికి తోడ్పడతాయి.
గుడ్డులోని తెల్లసొనను ముఖానికి, మెడకు పలుచటి పొరలా పట్టించాలి. ఆరిపోయాక చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది. రోజుకో గుడ్డు తీసుకోవాలని పోషకాహార నిపుణులు తరచూ గుర్తుచేస్తుంటారు. క్యారెట్లు సరేసరి. వీటిలో బీటా కెరోటిన్, విటమిన్-ఎ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మ పునఃసృష్టిని, కొలాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. క్యారె ట్ ముక్కలు, క్యారెట్ రసం, క్యారెట్ కూరలు.. ఏ రూపంలో తీసుకున్నా మంచి చేస్తాయి. ముడతల నివారణ మీద కంటే.. అసలు ముడతలే రాకుండా జాగ్రత్త పడటం మీదే ఫోకస్ చేస్తే ఇంకా మేలు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

