Lifestyle Habits | ఈ జీవనశైలి అలవాట్లతో కాలేయ ఆరోగ్యం పదిలం
జీవనశైలి అలవాట్లు (Lifestyle Habits) కొన్ని లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. క్రమంగా ఇది ఫ్యాటీ లివర్ వ్యాధి, సిరోసిస్‌కు దారితీసే ముప్పు పొంచిఉంది.
న్యూఢిల్లీ : శరీరంలో ప్రధాన అవయవాల్లో కాలేయం ముందువరసలో ఉంటుంది. శరీరంలో మలినాలను విసర్జించడంలో కాలేయం ప్రధాన పాత్ర పోషిస్తుంది. రక్తంలో హానికర పదార్ధాలను ఫిల్టర్ చేసే డీటాక్సిఫైర్గా కాలేయం పవర్‌హౌస్ అవయవంగా పనిచేస్తుంది. కొవ్వును కరిగించే రసాయనం బైల్‌ను ఉత్పత్తి చేసి జీర్ణక్రియకు కాలేయం దోహదపడుతుంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను లివర్ నియంత్రిస్తుంది. అయితే జీవనశైలి అలవాట్లు (Lifestyle Habits) కొన్ని లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. క్రమంగా ఇది ఫ్యాటీ లివర్ వ్యాధి, సిరోసిస్‌కు దారితీసే ముప్పు పొంచిఉంది. మెరుగైన జీవనశైలి అలవాట్లను అలవరచుకోవడం ద్వారా లివర్‌ను పదిలంగా ఉంచుకోవచ్చని హెపటాలజిస్ట్ డాక్టర్ సిరియక్ అబీ ఫిలిప్స్ చెబుతున్నారు. కాలేయం మెరుగ్గా పనిచేసేందుకు 15 జీవనశైలి అలవాట్లను అలవరచుకోవాలని డాక్టర్ ఫిలిప్స్ సూచిస్తున్నారు.
వారానికి కనీసం 150 గంటల బ్రిస్క్ వాక్
వారానికి ఒకసారి రన్నింగ్
షుగర్ లేకుండా రోజుకు 3 కప్పుల బ్లాక్ కాఫీ
మద్యపానం, ధూమపానానికి దూరం
రోజుకు కనీసం 7 గంటల నిద్ర
హెర్బల్ సప్లిమెంట్స్‌కు దూరం
హెపటైటిస్ బీ వ్యాక్సిన్
ప్రాసెస్డ్ ఫుడ్‌కు చెక్
షుగర్, స్వీట్ డ్రింక్స్‌కు దూరం
బరువు తగ్గుదల
నట్స్, సీడ్స్, ఆరోగ్యకర కొవ్వులతో కూడిన ఆహారం
పెరుగు, మజ్జిగ
మధుమేహం, కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవాలి
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

