Pregnancy Tips | నాకు ఆరో నెల.. ఇటీవల ముక్కులో నుంచి రక్తం కారుతోంది.. ఇదేమైనా ప్రమాదానికి సంకేతమా?
Pregnancy Tips | గర్భిణుల్లో కొందరికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలో వచ్చే మార్పుల కారణంగా ఇలా జరుగుతుంది. అంటే ముక్కులోపలి భాగం ఈ హార్మోన్‌కు తీవ్రంగా స్పందించడంతో ముక్కులోంచి రక్తం కారుతుంది.
Pregnancy Tips | నా వయసు పాతికేండ్లు. గర్భిణిని. ప్రస్తుతం ఆరో నెల. ఇటీవల ముక్కు నుంచి రెండుమూడు సార్లు రక్తస్రావం అయ్యింది. డాక్టర్ దగ్గరికి వెళితే మందులిచ్చారు. అసలు, ఇలా ఎందుకు జరుగుతుంది. ఇదేమైనా ప్రమాద సంకేతమా?
– ఓ పాఠకురాలు
గర్భిణుల్లో కొందరికి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. శరీరంలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలో వచ్చే మార్పుల కారణంగా ఇలా జరుగుతుంది. అంటే ముక్కులోపలి భాగం ఈ హార్మోన్‌కు తీవ్రంగా స్పందించడంతో ముక్కులోంచి రక్తం కారుతుంది. మీ విషయంలో కూడా ఇలానే జరిగి ఉంటే అదేమీ ప్రమాదకరం కాదు. డాక్టర్ ఇచ్చిన మందులు వాడితే సరిపోతుంది.
ఈఎన్టీ డాక్టర్‌ను కూడా ఒకసారి కలవండి. ముక్కుకు సంబంధించి ఇతర సమస్యలేమైనా ఉన్నాయా అన్నదీ తెలుసుకుంటే మంచిది. అలాగే ఎండలో ఎక్కువగా తిరిగినా కొన్నిసార్లు ముక్కు నుంచి రక్తస్రావం అవుతుంది. బాగా జలుబు చేసినప్పుడు.. గట్టిగా చీదితే నాసికం లోపలి సున్నితమైన నరాలు చిట్లినట్టు అయిపోయినా ఇలా జరగవచ్చు. ఇవన్నీ ఒకసారి సరిచూసుకుని, మీ విషయంలో కారణమేంటో తెలుసుకుని, మందులు వాడితే సరిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

