Skin Problems | ఎన్ని చేసినా చర్మ సమస్యలు తగ్గకపోతే.. అందుకు అనేక కారణాలు ఉంటాయి.. వాటిని కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
చర్మం మసకబారడం, అలసటగా కనిపించడం లేదా అసమాన రంగుతో కనిపించడం ప్రారంభమైనప్పుడు చాలా మంది వెంటనే కొత్త స్కిన్‌కేర్ ఉత్పత్తులను ప్రయత్నించడం మొదలుపెడతారు. కొత్త సీరమ్ లేదా ఫేస్ మాస్క్ తాత్కాలికంగా కొంత మెరుగుదల ఇస్తుంది. కానీ నిరంతరంగా కనిపించే డల్ స్కిన్ సమస్యకు ఒక్క ఉత్పత్తి లోపమే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు.
Skin Problems | చర్మం మసకబారడం, అలసటగా కనిపించడం లేదా అసమాన రంగుతో కనిపించడం ప్రారంభమైనప్పుడు చాలా మంది వెంటనే కొత్త స్కిన్‌కేర్ ఉత్పత్తులను ప్రయత్నించడం మొదలుపెడతారు. కొత్త సీరమ్ లేదా ఫేస్ మాస్క్ తాత్కాలికంగా కొంత మెరుగుదల ఇస్తుంది. కానీ నిరంతరంగా కనిపించే డల్ స్కిన్ సమస్యకు ఒక్క ఉత్పత్తి లోపమే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. క్లినికల్ స్కిన్ ప్రాక్టీస్‌లో చర్మం మసకబారడం అనేది శాస్త్రీయంగా రూపొందించిన సరైన చికిత్స, సరైన ఫార్ములేషన్స్, జీవనశైలి మార్పులు అవసరమనే సంకేతంగా ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. అన్ని రకాల చర్మాల్లోనూ డల్‌నెస్‌కు అనేక అంతర్గత, బాహ్య కారణాలు ఉంటాయి. మానసిక ఒత్తిడి, తగిన నిద్ర లేకపోవడం, ఎక్కువసేపు స్క్రీన్ల ముందు గడపడం, కాలుష్యం, డీహైడ్రేషన్, సెబమ్ అసమతుల్యత, మైక్రోబియోమ్ లోపాలు, మెలనిన్ అసమాన పంపిణీ, కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వంటి అంశాలు చర్మ కాంతిని ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలంలో ఇవి చర్మపు రక్షణ పొరను బలహీనపరచి సహజ కాంతిని తగ్గిస్తాయి. అందుకే ఎన్నాళ్లుగానో వాడుతున్న స్కిన్‌కేర్ రొటీన్ కూడా ఒక దశ తర్వాత ఫలితం ఇవ్వదు.
నీరు తగినంత లేకపోవడం..
డల్ స్కిన్‌ను తగ్గించడంలో మొదటి, అత్యంత ముఖ్యమైన దశ దానికి కారణమేమిటో తెలుసుకోవడం. కొందరిలో నీటి లోపం, తగిన మాయిశ్చర్ లేకపోవడం ప్రధాన కారణం అవుతాయి. మరికొందరిలో సన్ డ్యామేజ్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, పిగ్మెంటేషన్ సమస్యలు లేదా అసమతుల జీవనశైలి కారణమవుతాయి. శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడి వల్ల ఎండోర్ఫిన్ స్థాయిలు తగ్గిపోవడం కూడా చర్మ కాంతిపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. సరైన స్కిన్ అసెస్మెంట్ ద్వారా అసలు సమస్యను గుర్తిస్తే, చికిత్స కూడా మరింత టార్గెటెడ్‌గా, ఫలితాలిచ్చే విధంగా ఉంటుంది. చర్మంపై పేరుకుపోయే మృతకణాలు, అదనపు ఆయిల్, కాలుష్యపు కణాలను తొలగించకపోతే చర్మం మరింత డల్‌గా కనిపిస్తుంది. ప్రొఫెషనల్ డీప్ క్లెన్సింగ్, ఎక్స్ఫోలియేషన్ ఫేషియల్స్ చర్మ పునరుత్పత్తిని వేగవంతం చేస్తాయి. అలాగే చర్మానికి ఆక్సిజన్, పోషకాలు సరిగా అందేలా చేసి ఫ్రెష్ లుక్‌ను తీసుకువస్తాయి.
చర్మ రక్షణ పొర బలహీనపడితే..
తగినంత తేమ లేకపోవడం డల్ స్కిన్‌కు ప్రధాన కారణాల్లో ఒకటి. డీహైడ్రేటెడ్ చర్మం రఫ్‌గా, అలసటగా కనిపిస్తుంది. ఆక్సిజన్ ఫేషియల్స్, మాయిశ్చర్ రీప్లెనిషింగ్ ట్రీట్మెంట్స్ వంటి హైడ్రేషన్ ఆధారిత థెరపీలు చర్మంలోని లోతైన పొరల్లో నీటి సమతుల్యతను పునరుద్ధరిస్తాయి. సరైన నీటి సేవనం, సమతుల ఆహారం, ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ కూడా చర్మ కాంతిని మెరుగుపరుస్తాయి. చర్మ రక్షణ పొర బలహీనపడితే నీటి నష్టం పెరుగుతుంది. అదే సమయంలో కాలుష్యం, ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఇన్ఫ్లమేషన్ ప్రభావం కూడా ఎక్కువవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఎక్కువ యాక్టివ్ కెమికల్స్ వాడడం కంటే స్కిన్ బ్యారియర్ రిపేర్‌పై దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. జెంటిల్ స్కిన్‌కేర్, సూతింగ్ థెరపీలు, మైక్రోబియోమ్ సపోర్టివ్ ఫార్ములేషన్స్, బ్యారియర్ రిపేర్ ఫేషియల్స్ చర్మాన్ని మళ్లీ ఆరోగ్యంగా మారుస్తాయి. టానింగ్, పిగ్మెంటేషన్, సన్ డ్యామేజ్ కారణంగా కూడా చర్మం మసకబారుతుంది. కంట్రోల్డ్ ఎక్స్ఫోలియేషన్, స్కిన్ రీజువెనేషన్ ప్రొసీజర్స్ చర్మ టెక్స్చర్ను మెరుగుపరుస్తాయి. వెంటనే రంగు మార్పు కోసం కాకుండా, చర్మ నాణ్యతను క్రమంగా మెరుగుపరచడమే ఈ చికిత్సల అసలు లక్ష్యం.
జీవనశైలి ముఖ్యం..
ఎంత ఖరీదైన స్కిన్‌కేర్ చేసినా సరైన జీవనశైలి లేకపోతే దీర్ఘకాల ఫలితాలు రావు. మంచి నిద్ర, సమతుల ఆహారం, ఒత్తిడి నియంత్రణ, క్రమమైన వ్యాయామం, తగినంత నీటి సేవనం వంటి అంశాలు చర్మ ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి, హార్మోన్ బ్యాలెన్స్, ఇన్ఫ్లమేషన్ నియంత్రణకు ఇవి కీలకం. తి వ్యక్తి చర్మ నిర్మాణం భిన్నంగా ఉంటుంది. కొందరికి హైడ్రేషన్, బ్యారియర్ రిపేర్ అవసరమైతే, మరికొందరికి పిగ్మెంటేషన్ కరెక్షన్, యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ లేదా రీజువెనేషన్ థెరపీలు అవసరం అవుతాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రొటీన్లను అనుసరించడం కంటే, వ్యక్తిగత చర్మ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన స్టెప్ బై స్టెప్ స్కిన్ మేనేజ్మెంట్ ప్లాన్ దీర్ఘకాలంలో మెరుగైన ఫలితాలను ఇస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- health tips
- Skin problems
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

