High Cholesterol Levels | కొలెస్ట్రాల్ స్థాయిలు అధికంగా ఉన్నాయా..? అయితే ఈ విత్తనాలను తినండి..!
శరీరంలో వేగంగా పెరిగే కొలెస్ట్రాల్ బలహీనమైన గుండెకు సూచిక అని వైద్యులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయి. దీని వల్ల గుండె పనితీరు దెబ్బతినడంతో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది.
High Cholesterol Levels | శరీరంలో వేగంగా పెరిగే కొలెస్ట్రాల్ బలహీనమైన గుండెకు సూచిక అని వైద్యులు చెబుతున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయి. దీని వల్ల గుండె పనితీరు దెబ్బతినడంతో పాటు గుండె జబ్బులు, స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి గుండె సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉండేలా చూసుకోవాలి. మనం తీసుకునే ఆహారాల ద్వారా కూడా మనం శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలతో పాటు కొన్ని రకాల విత్తనాలను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను సహజంగా తగ్గించుకోవచ్చు. ఈ విత్తనాల్లో ఫైబర్, మంచి కొవ్వులతో పాటు ఫైటో కెమికల్స్ కూడా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను సహజంగా తగ్గించే విత్తనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అవిసె గింజలు, నువ్వులు, గుమ్మడి గింజలు..
కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో అవిసె గింజలు మనకు ఎంతో సహాయపడతాయి. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు అల్ఫాలినోలెనిక్ ఆమ్లం కూడా ఉంటుంది. అలాగే వీటిలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది పేగుల్లో ఉండే కొలెస్ట్రాల్ ను గ్రహించి శరీరం నుండి బయటకు తొలగిస్తుంది. అవిసెగింజలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు లిపిడ్ ప్రొఫైల్ కూడా మెరుగుపడుతుంది. వీటిని పెరుగు, ఓట్మీల్ వంటి వాటితో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. నువ్వులను కూడా మనం ఎంతో కాలంగా ఆహారంగా తీసుకుంటున్నాం. నువ్వులు లిగ్నన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, మొక్కల స్టెరాల్స్ తో నిండి ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సలాడ్స్, స్మూతీ వంటి వాటితో నువ్వులను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విత్తనాల్లో గుమ్మడి గింజలు కూడా ఒకటి. వీటిలో మెగ్నీషియంతో పాటు ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి. ప్రతిరోజూ గుమ్మడి గింజలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటిని చిరుతిండిగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు శరీరానికి కావల్సిన పోషకాలు కూడా అందుతాయి.
చియా విత్తనాలు, పొద్దుతిరుగుడు గింజలు..
చిన్నగా ఉన్నప్పటికీ చియా విత్తనాలు శక్తివంతంగా పని చేస్తాయి. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. చియా విత్తనాలను పుడ్డింగ్, పానీయాలను, సలాడ్ వంటి వాటితో పాటు తృణ ధాన్యాలపై టాపింగ్ లా వేసి తీసుకోవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గడంతో పాటు శరీర బరువు కూడా అదుపులో ఉంటుంది. అలాగే పొద్దు తిరుగుడు గింజలు కూడా కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో ఫైటోస్టెరాల్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శరీరం కొలెస్ట్రాల్ ను గ్రహించకుండా నిరోధించడంలో సహాయపడతాయి.
పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు వెంటనే తగ్గుతాయి. ఉప్పులేని పొద్దుతిరుగుడు గింజలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధికంగా ఉండే కొలెస్ట్రాల్ స్థాయిలు గుండె ఆరోగ్యంతో పాటు శరీర ఆరోగ్యానికి కూడా హానిని కలిగిస్తాయి కనుక శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉండేలా చూసుకోవాలి. కొలెస్ట్రాల్ ను తగ్గించే విత్తనాలను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యానికి మేలు కలుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

