Hair Fall | జుట్టు రాలడం వెనుక ఉన్న సైలెంట్ కారణాలు ఇవే.. జాగ్రత్తలు పాటిస్తే తొలగిపోతుంది..
జుట్టు రాలడం (Hair Fall) అన్ని వయసుల వారిలో కనిపించే సాధారణ సమస్య. కొద్దిగా జుట్టు రాలడం సహజమే అయినప్పటికీ, అది ఎక్కువగా, తరచూ జరిగితే ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతోపాటు జీవనశైలి అలవాట్లు కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.
Hair Fall | జుట్టు రాలడం (Hair Fall) అన్ని వయసుల వారిలో కనిపించే సాధారణ సమస్య. కొద్దిగా జుట్టు రాలడం సహజమే అయినప్పటికీ, అది ఎక్కువగా, తరచూ జరిగితే ఆందోళన కలిగించే అంశంగా మారుతుంది. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం వంటి కారణాలతోపాటు జీవనశైలి అలవాట్లు కూడా జుట్టు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. జుట్టు రాలడానికి కొన్ని సైలెంట్ కారణాలు ఉంటాయి. ఇవి బయటికి వెంటనే కనిపించకపోయినా, లోపల శరీరంలో జరుగుతున్న మార్పులు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిపుణుల ప్రకారం జుట్టు రాలడానికి గల సైలెంట్ కారణాలు ఇలా ఉన్నాయి.
ఒత్తిడి, పోషకాహార లోపం..
మొదటిది అధిక ఒత్తిడి. ఇది జుట్టు రాలడానికి ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలిక స్ట్రెస్ వల్ల కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది జుట్టు రూట్స్‌ను విశ్రాంతి దశలోకి నెట్టేస్తుంది. ఫలితంగా కొత్త జుట్టు పెరుగుదల తగ్గి, జుట్టు రాలడం పెరుగుతుంది. అంతేకాకుండా స్ట్రెస్ వల్ల ఇన్ఫ్లమేషన్ (వాపు) పెరిగి హెయిర్ ఫోలికల్స్‌ను బలహీనపరుస్తుంది. రెండవ కారణం పోషకాహార లోపం. ఐరన్, జింక్, మెగ్నీషియం, విటమిన్ డి, విటమిన్ బి12 వంటి పోషకాలు తక్కువగా ఉంటే జుట్టు పెరుగుదల మందగిస్తుంది. ఇవి కెరాటిన్ ఉత్పత్తికి అవసరమైనవి కావడంతో, లోపం ఉంటే జుట్టు బలహీనంగా మారుతుంది.
జీర్ణ సమస్యలు..
ఇక మూడవ కారణం గట్ (జీర్ణ వ్యవస్థ) ఆరోగ్యం. గట్ మైక్రోబయోమ్ (మంచి బ్యాక్టీరియా) అసమతుల్యత (Gut Dysbiosis) వల్ల పోషకాలు శరీరానికి సరిగ్గా అందవు. దీని వల్ల జుట్టు వృద్ధికి అవసరమైన పోషణ తగ్గిపోతుంది. అలాగే శరీరంలో ఇన్ఫ్లమేషన్ పెరిగి హెయిర్ ఫోలికల్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుంది. నాలుగవ కారణం కెమికల్ ఓవర్‌లోడ్. హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్, కఠిన రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల జుట్టు నిర్మాణం దెబ్బతింటుంది. ఇది హెయిర్ ఫోలికల్స్‌ను బలహీనపరచి జుట్టు రాలే పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. ఇక జుట్టు రాలే సమస్యను తగ్గించాలంటే సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, ఒత్తిడిని నియంత్రించడం, సహజమైన హెయిర్ కేర్ అలవాట్లు పాటించడం అవసరం. సరైన జీవనశైలిని అనుసరిస్తే జుట్టు రాలడం తగ్గడంతోపాటు ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుదలకు దోహదపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- hair fall
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Sethupathi | అంతర్జాతీయ వేదికపై అరుదైన ఘనత.. ఎమ్మీ అవార్డ్స్ ప్రెజెంటర్‌గా విజయ్ సేతుపతి!
Vega Jewellers: దిల్‌సుఖ్‌నగర్‌లో వేగా జ్యువెలర్స్ కొత్త షోరూమ్ ప్రారంభం
Diwali Firecracker Sales | దీపావళి వేళ అనుమతల్లేకుండానే టపాసుల వ్యాపారం.. ఆందోళనలో లైసెన్సుదారులు
Salman Khan | రూ.4 వేల కోట్ల బడ్జెట్ కాదు,రాముడు, సీత పాత్రల గొప్పతనంపై మాట్లాడాలి.. ‘రామాయణం’పై సల్మాన్ ఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Mammootty | ఏడేళ్ల తర్వాత తమిళంలో నటిస్తున్నా.. ‘ఓం’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మమ్ముట్టి!
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

