కొవిడ్ పేషెంట్లూ.. అప్పుడే సర్జరీల జోలికి వెళ్లకండి: ఐసీఎంఆర్

న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న వాళ్లు వెంటనే సర్జరీలు చేయించుకోకూడదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) సూచించింది. అత్యవసరం కాని సర్జరీలను కొవిడ్ నుంచి కోలుకున్న 6 వారాల తర్వాతే చేయించుకోవాలని స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల త్వరగా కోలుకుంటారని చెప్పింది. ఇక ఇలాంటి పేషెంట్లు సర్జరీకి ముందు చేసుకునే ఆర్టీ-పీసీఆర్ టెస్టుల్లో పాజిటివ్‌గా తేలినా కంగారు పడాల్సిన అవసరం లేదని, శరీరంలో మిగిలిపోయిన హాని చేయని చనిపోయిన వైరస్ కారణంగా ఇలా టెస్టులు పాజిటివ్‌గా వస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది.
అత్యవసరమైన సర్జరీలైతే..
కొవిడ్ రీఇన్ఫెక్షన్ కనీసం 102 రోజుల తర్వాతే నిర్ధారణ అవుతుందని, అందువల్ల ఇలాంటి సర్జరీలను వాయిదా వేయడమే మంచిదని అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ సంజయ్ పూజారి చెప్పారు. అయితే అత్యవసర సర్జరీలను మాత్రం అన్ని ముందు జాగ్రత్తలతో వెంటనే నిర్వహించాలని ఆయన స్పష్టం చేశారు. అయితే కొవిడ్ పేషెంట్లకు సర్జరీ చేసే ముందు వారి గుండె, ఊపిరితిత్తుల పనితీరును పరిశీలించాలని సూచించారు.
కొవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా కొంతమందిలో 60 రోజుల వరకూ కూడా అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఛాతీ నొప్పి వంటి లక్షణాలు ఉంటాయని డాక్టర్ పూజారి చెప్పారు. అందువల్ల ఇలాంటి వారికి సర్జరీలు చేసే ముందు అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అసలు 102 రోజుల వరకూ కూడా కొవిడ్ నుంచి కోలుకున్న వారిని తిరిగి టెస్టు చేయడం అనేది సమయం వృథా చేయడమే అవుతుందని పలువురు డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు.
ఎవరికి ఎప్పుడు సర్జరీ?
అత్యవసరం కాని సర్జరీల విషయంలో కొవిడ్ పేషెంట్లు కోలుకున్న తర్వాత ఎంత సమయం తీసుకోవాలో ఒకసారి చూద్దాం.
- లక్షణాలు లేకుండా లేదంటే స్వల్ప, శ్వాసకోశ సంబంధిత సమస్యలు లేకుండా కోలుకున్న వారైతే 4 వారాలు ఆగాలి.
- ఇక దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు వంటి లక్షణాలతో బాధపడిన పేషెంట్లయితే కనీసం 6 వారాలు ఆగాల్సి ఉంటుంది.
- ఇక కొవిడ్‌తో ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్న వాళ్లు, షుగర్ ఉన్న వాళ్లు మాత్రం 8 నుంచి 10 వారాల తర్వాతే సర్జరీల జోలికి వెళ్లాలి.
- ఇక ఐసీయూలో చేరిన పేషెంట్లయితే 12 వారాల తర్వాతే చేయించుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

