పిక్కీ ఈటింగ్ మాన్పించేదెలా?
పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ సమస్యలతోపాటు మా పిల్లలు అవి తినడం లేదని, ఇవే ఇష్టంగా తింటున్నారని చెబుతుంటారు. ఇది చాలామంది పిల్లల్లో ఉండే సమస్యే. దీనిని ‘పిక్కీ ఈటింగ్' అంటారు. కొంతమంది కొన్ని రకాల ఆహార పదార్థాలనే తింటారు. కొన్నిటిని ఇష్టపడరు.
పిల్లలకు ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆ సమస్యలతోపాటు మా పిల్లలు అవి తినడం లేదని, ఇవే ఇష్టంగా తింటున్నారని చెబుతుంటారు. ఇది చాలామంది పిల్లల్లో ఉండే సమస్యే. దీనిని ‘పిక్కీ ఈటింగ్’ అంటారు. కొంతమంది కొన్ని రకాల ఆహార పదార్థాలనే తింటారు. కొన్నిటిని ఇష్టపడరు. తల్లిదండ్రులు ఎంత ప్రయత్నం చేసినా తినరు. కొత్త వాటిని తినడానికి భయపడతారు. ఈ సమస్య చాలామంది పిల్లల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా రెండు నుంచి మూడేండ్ల వయసు పిల్లల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. ఇలాంటి చిన్నారులకు ఆహారంతో అనుబంధం పెంచేందుకు తల్లిదండ్రులు ప్రయత్నించాలి.
సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలకు ‘ఫుడ్ ఎక్కడ తినాలి? ఎంత తినాలి? ఎప్పుడు తినాలి?’ అనేది అలవాటు చేస్తారు. వాస్తవానికి ‘ఎంత తినాలి? ఇంత తింటానా? లేదా?’ అని పిల్లలు ఆలోచిస్తారు. కాబట్టి ఆ నిర్ణయం పిల్లలకే వదిలేయాలి. పిల్లలు ఎంత తినాలో పేరెంట్స్ నిర్ణయించవద్దు. అలా నియంత్రిస్తే.. అవసరానికి మించి ఎక్కువగా తింటారు. ఇది పిక్కీ ఈటింగ్కి దారితీస్తుంది. ఇలాంటి పిల్లలకు సెన్సరీ ప్లేని ఎంకరేజ్ చేయాలి. అన్నం తినేప్పుడు చిల్డ్రన్ ఫ్రెండ్లీగా ఉండేలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దగ్గరగా కూర్చోబెట్టుకోవాలి. తోబుట్టువులనూ పక్కనే కూర్చోబెట్టి వారికీ వడ్డించాలి. కలిసి తినడం వల్ల పక్కవాళ్లు తినే పదార్థాలపై ఆసక్తి చూపిస్తారు.
కొత్తవి తినడానికి భయం కొంత తగ్గుతుంది. తినేటప్పుడు ఫోన్ చూపించవద్దు. టీవీ కూడా ఆఫ్ చేయాలి. ‘ఈ పండు తింటే చాక్లెట్ ఇస్తానని, నవ్వు అడిగిన ఐస్ క్రీమ్ కొనిస్తా’నని కొత్తగా లంచగొండి ఆలోచనలు కలిగించవద్దు. ఏదైనా ఆహారం ఒకటీ రెండుసార్లు తినకపోతే పిక్కీ ఈటింగ్ సమస్య ఉందనుకోవద్దు. పది నుంచి ఇరవై సార్లు ప్రయత్నించినా.. తినక పోతేనే వాళ్లకు పిక్కీ ఈటింగ్ సమస్య ఉందనే నిర్ణయానికి రావాలి. అప్పుడు దానిని బలవంతంగా తినిపించే ప్రయత్నం చేయొద్దు.
పిల్లలు ఒక రకమైన ఆహారాన్ని తీసుకోవడానికి ఇష్టపడటం లేదంటే, దానిని వాళ్లు బాగా ఇష్టపడే ఆహారంతోపాటుగా ఇవ్వాలి. పిక్కీ ఈటింగ్ సమస్య ఉంటే.. అన్నీ కొత్త వంటకాలు కాకుండా కొన్ని పాత రుచులు కూడా ఉండేలా జాగ్రత్తపడాలి. భోజన సమయానికి రెండు, మూడు గంటల ముందు స్నాక్స్, డ్రింక్స్, జ్యూస్లు ఇవ్వకూడదు. అయితే కొంతమంది పిల్లల్లో ‘అవయిడెడ్ రెస్ట్రిక్టివ్ ఫుడ్ ఇంటేక్ డిజార్డర్’ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు చాలా రకాల ఆహార పదార్థాలు తినరు. అవి చూడగానే అయిష్టత చూపుతారు. అది ముఖంలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సమస్య ఉంటే పిల్లల డాక్టర్కు చూపించాలి.
– డాక్టర్ అనుపమ వై. సీనియర్ పీడియాట్రిక్ ఇంటెన్సివిస్ట్ అండ్ పీడియాట్రీషియన్
రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

