Hing | హింగ్ ఈజ్ కింగ్.. చూసేందుకు బెల్లంలా కనిపించే ఇంగువతో ఉపయోగాలెన్నో
ఇంగువ ఉరఫ్ హింగ్.. చూసేందుకు బెల్లంలాగే కనిపిస్తుంది. నోట్లో పెట్టుకుంటే మాత్రం భరించలేనంత వగరు. అయితేనేం, ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు. మృగశిర కార్తెనాడు చిన్న బెల్లంముక్కలో చిటికెడు ఇంగువ కలిపి నాలుకకు తగలకుండా నేరుగా గొంతులో వేసుకోవడం తరాల అలవాటు. రోజువారీ ఆహారంలో ఇంగువను భాగం చేసుకుంటే అనేక ఉపయోగాలు.
Hing | ఇంగువ ఉరఫ్ హింగ్.. చూసేందుకు బెల్లంలాగే కనిపిస్తుంది. నోట్లో పెట్టుకుంటే మాత్రం భరించలేనంత వగరు. అయితేనేం, ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు. మృగశిర కార్తెనాడు చిన్న బెల్లంముక్కలో చిటికెడు ఇంగువ కలిపి నాలుకకు తగలకుండా నేరుగా గొంతులో వేసుకోవడం తరాల అలవాటు. రోజువారీ ఆహారంలో ఇంగువను భాగం చేసుకుంటే అనేక ఉపయోగాలు.
- జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలకు చెక్ పెట్టి.. జీవక్రియను మెరుగు పరుస్తుంది.
- ఒంట్లో ఉన్న వేడిని బయటికి పంపడంలో ఇంగువకు సాటి లేదు. శ్వాస సమస్యలకు కూడా ఇంగువ మంచి ఔషధం.
- పీరియడ్స్ సమయంలో వచ్చే కడుపు నొప్పి నుంచి ఇంగువ ఉపశమనం ఇస్తుంది. నెయ్యిలో కరిగించి తీసుకోవచ్చు.
- రక్తవృద్ధికి, గుండె ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది.
- గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని కాస్తంత ఇంగువ పొడి వేసుకుని.. అన్నం తిన్న అరగంట తర్వాత తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు.
- జలుబు, దగ్గు.. ఎలాంటి సీజనల్ వ్యాధులకైనా ఇంగువ తొలి ఔషధం.
- పాలలో చిటికెడు ఇంగువ కలిపి తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
- భోజనం తర్వాత చిటికెడు ఇంగువను మజ్జిగలో కలిపి తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. తొందరగా జీర్ణమవుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

