Watermelon | ఈ సమ్మర్లో పుచ్చకాయ కొంటున్నారా? ముందు ఈ విషయాలు తెలుసుకోండి..

ఎండాకాలంలో విరివిగా కనిపించే పండ్లలో ఒకటి పుచ్చకాయ. వేసవి తాపాన్ని తగ్గించి, శరీరానికి ఉత్తేజాన్ని ఇవ్వడంలో వీటిని మించి మరొకటి లేదనే చెప్పొచ్చు.

95 శాతం వరకు నీరే ఉన్న ఈ పండును తినడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. అందుకే సమ్మర్ వచ్చిందంటే వీటికి గిరాకీ బాగుంటుంది.

కాయలు తెచ్చి ఒక్కోసారి మోసపోతుంటారు. అందుకే పుచ్చకాయలను కొనేముందు ఈ చిట్కాలు ఫాలో అయితే మంచి కాయను కొనుక్కోవచ్చు.

అవునండి! పుచ్చకాయలో ఆడ, మగ జాతులు కూడా ఉంటాయి. ఆడ పుచ్చకాయలు చిన్నగా, గుండ్రంగా ఉంటాయి. మగ పుచ్చకాయలు పొడుగ్గా, కోడిగుడ్డు ఆకారంలో ఉంటాయి. వీటిలో నీటి శాతం, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. అదే తియ్యటి కాయ కావాలంటే ఆడపుచ్చ కాయను తీసుకోవడం మేలు.

పుచ్చకాయ ఎంత పెద్దగా ఉంటే అంత బాగుంటుందని చాలామంది అపోహ పడతారు. కానీ అది నిజం కాదు.. పుచ్చకాయ రుచికి దాని పరిమాణానికి సంబంధం లేదు. కాయ ఏ సైజ్‌లో ఉన్నా సరే.. పట్టుకున్నప్పుడు బరువుగా ఉండాలి. అలా బరువుగా ఉంటే కాయ లోపల నీళ్లు, గుజ్జు ఎక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవచ్చు. అందుకే ఎప్పుడూ సాధారణ సైజ్‌లో ఎక్కువ బరువు ఉన్న కాయలనే ఎంచుకోవాలి.

చాలామంది పచ్చగా కనిపించే పుచ్చకాయలను కొంటుంటారు. అవి తాజాగా ఉంటాయని అనుకుంటారు. కానీ అలాంటి కాయలు పూర్తిగా పండక.. చప్పగా అనిపిస్తుంటాయి. నిజానికి పూర్తిగా పండిన పుచ్చకాయ ముదురు పచ్చ రంగులో ఉంటుంది. అలాంటి కాయలే రుచిగా ఉంటాయి.

కొన్ని పుచ్చకాయలపై ఒకవైపు తెలుపు, గోధుమ రంగు మచ్చలు చూసే ఉంటారు. ఈ మచ్చలు ఎంత ముదురు రంగులో ఉంటే ఆ కాయ అంత రుచిగా ఉంటుంది. కొన్ని కాయలపై పిచ్చి గీతలు గీసినట్లు గోధుమ రంగు మచ్చలు ఉంటాయి. ఈ కాయలు చాలా రుచిగా ఉంటాయి. ఈ మచ్చలు కూడా తేనెటీగలు పదే పదే వాలడం వల్ల ఏర్పడతాయంట.

పుచ్చకాయ తొడిమను చూసి కూడా కాయ రుచి ఎలా ఉంటుందో చెప్పొచ్చు. తొడిమ ఎండిపోయినట్లు ఉంటే ఆ కాయ బాగా పండిందని అర్థం. అలా కాకుండా తొడిమ పచ్చిగా ఉంటే ఇంకా ఆ కాయ పండలేదనే చెప్పొచ్చు.

పుచ్చకాయను కొనేముందు దానిపై వేళ్లతో కొట్టడం ద్వారా ఆ కాయ ఎలాంటిదో కనుక్కోవచ్చు. పుచ్చకాయను వేళ్లతో తాకినప్పుడు గుల్లలా టక్ టక్ అని శబ్దం వస్తే ఆ కాయ బాగా పండిందని చెప్పొచ్చు. అదే శబ్దం రాకపోతే ఆ కాయ ఇంకా పండాల్సి ఉందని అర్థం

పుచ్చకాయను ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసినప్పుడు తియ్యటి వాసన వస్తుంది. మరి తియ్యగా వస్తే మాత్రం ఆ కాయను తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఆ కాయ బాగా పండి.. మురిగిపోయేందుకు దగ్గరలో ఉందన్నమాట.
తాజా వార్తలు
Air India Flight: కోల్‌కతాలో హైజాక్ అలర్ట్ జారీ చేసిన ఎయిర్ ఇండియా పైలట్
Vijayasai Reddy | ఏపీలో మరో రాజకీయ పార్టీ.. ‘పరివర్తన రాజనీతి పార్టీ’ని ప్రకటించిన విజయసాయిరెడ్డి!
Hyderabad | రెండు నెలల్లో 9 మంది జలమండలి ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మృతి..!
Vishwambara | మెగాస్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సైలెంట్‌గా పనులు పూర్తి చేస్తున్న వశిష్ఠ!
Tharun Bhascker | చెత్తను పంచదార పూసి ఇస్తే ఆడియన్స్ నమ్మరు.. రొటీన్ సినిమాలపై తరుణ్ భాస్కర్ కామెంట్స్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
