పీరియడ్స్ సమయంలో వాటిని వాడితే పొర దెబ్బతింటుందా?
నమస్తే మేడం. నా వయసు ఇరవై రెండు. ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నా. నాకు పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది.
నమస్తే మేడం. నా వయసు ఇరవై రెండు. ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నా. నాకు పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ ఎక్కువగా అవుతుంది. దీనివల్ల తరచూ ప్యాడ్స్ మార్చుకోవాల్సి వస్తున్నది. ఇదంతా ఇబ్బందిగా అనిపిస్తున్నది. అయితే ఈ మధ్య మా చుట్టాలమ్మాయి ట్యాంపూన్లు, మెన్స్ట్రువల్ కప్‌ల గురించి చెప్పింది. వీటివల్ల నా సమస్య తీరుతుందని అనిపించింది. కానీ, వాటిని వాడితే కన్నెపొర దెబ్బ తింటుందని అమ్మ అనుమానం. సలహా ఇవ్వగలరు.
– ఓ సోదరి
యోని లోపలికి చొచ్చుకుపోయే ట్యాంపూన్లు, మెన్స్ట్రువల్ కప్లలాంటి వాటితో కొంత జాగ్రత్తగా ఉండటం మంచిదే. మీకు పెళ్లికాలేదు కాబట్టి, కన్నెపొర దెబ్బతినకుండా ఉండాలంటే చిన్న సైజు మెన్స్ట్రువల్ కప్‌ను వాడండి. ఈ తరహా కప్‌లలో స్మాల్, మీడియం, లార్జ్… ఇలా రకరకాలు ఉంటాయి. చిన్నవి అయితే కప్పు ఎక్కువ లోపలికి వెళ్లే ప్రమాదం ఉండదు. ట్యాంపూన్ల వల్ల మాత్రం కొన్నిసార్లు కన్నెపొర దెబ్బతినే ఆస్కారం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి దాన్ని పక్కన పెట్టొచ్చు. ఇంకో విషయం.. వాటిని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. నెలసరి స్రావాల్ని శోషించుకునే ఈ పరికరం యోని లోపలే ఉంటుంది కనుక.. ఎక్కువ సేపు మార్చకుండా ఉంటే ‘టాక్సిక్ షాక్ సిండ్రోమ్’ బారినపడే అవకాశం ఉంది.
జ్వరం, ఫ్లూ లక్షణాలతోపాటు కొన్నిసార్లు డయేరియాలా కనిపించే ఈ వ్యాధి అత్యంత ప్రమాదకరంగా మారే ప్రమాదం ఉంది. ఇక, మెన్స్ట్రువల్ కప్ వాడినా సరే.. దాన్ని మూడు నాలుగు గంటలకు ఒకసారి ఖాళీ చేస్తూ ఉండాలి. ఈ కప్‌లను కూడా రెండు మూడు నెలలు వాడి పడేయాలి. దీర్ఘకాల వినియోగం మంచిది కాదు. ఇక, మీకు బ్లీడింగ్ ఎక్కువని అంటున్నారు కాబట్టి, సమస్య మూల కారణాలు తెలుసుకోవాలి. థైరాయిడ్ ఉన్నా ఈ ఇబ్బంది వస్తుంది. వెంటనే మంచి గైనకాలజిస్టును సంప్రదించి, తగిన పరీక్షలు చేయించుకుంటే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

