మనసుల కలయికతో ఇద్దరి మధ్య చిగురించే ప్రేమ.. ఎంతో ధృడంగా మారుతోంది. ఈ ప్రేమ వారికి శారీరక ఆరోగ్యంతో పాటు గుండెకు కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.
కార్డియాలజీ వైద్య నిపుణుల ప్రకారం.. ఇద్దరు ప్రేమికులు తొలిసారిగా కలిసినప్పుడు.. వారి నుంచి నోరిపినెఫ్రిన్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఈ హార్మోన్లు వారి మనసులను ఉత్తేజపరుస్తాయి. అంతేకాకుండా ప్రేమించిన వ్యక్తి మన కళ్ల ముందు ఉండటంతో ప్రత్యేక ఆకర్షణను కలిగి ఉంటాము. వారి హృదయస్పందన కూడా పెరుగుతుంది. మనసులు ఉత్తేజితమవడం, ప్రత్యేక ఆకర్షణగా నిలవడం, హృదయస్పందన పెరగడం అన్ని ఏకకాలంలోనే జరిగిపోతాయి.
ఇక మీరు ప్రేమించిన వ్యక్తితో అధిక సమయం గడిపితే.. మీలో రొమాన్స్ పెరిగిపోతాయి. మీకు తెలియకుండానే అవతలి వ్యక్తికి దగ్గరవుతుంటారు. ఆ సమయంలో మన మెదడు నుంచి ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, వాసోప్రెసిన్ వంటి హార్మోన్లు విడుదలై ఆ ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన సంబంధాన్ని పెంపొందించడంలో సహాయ పడుతాయి.
ఆక్సిటోసిన్, ఎండార్ఫిన్స్, వాసోప్రెసిన్ వంటి హార్మోన్లు.. రక్తపోటును తగ్గించడం, హృదయ స్పందన రేటును తగ్గిస్తాయి. దీంతో గుండెను ఆరోగ్యంగా కాపాడుకోవడానికి సహాయపడుతుంది. సైన్స్ ప్రకారం.. ఓ వ్యక్తి తమ భాగస్వామితో అన్యోన్యంగా సమయం గడిపినప్పుడు, వారి రక్తపోటు, హృదయ స్పందన తగ్గుతుంది. ఒకరికొకరు సురక్షితంగా, సుఖంగా ఉంటారు.