H3N2 virus | దేశాన్ని భయపెట్టిస్తున్న జలుబు, దగ్గు.. ఇంత విజృంభిస్తున్నా యాంటీబయాటిక్స్ ఎందుకు వాడొద్దంటున్నారు..?
H3N2 virus | వేసవి ప్రవేశిస్తున్న ప్రస్తుత సమయంలో దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్ జ్వరాల బారిన పడటం కలవరపెడుతోంది. కొవిడ్ తరహా లక్షణాలున్న ఈ వ్యాధులకు ‘ఇన్‌ఫ్లూయెంజా-ఏ ఉప రకం హెచ్3ఎన్2’ (Influenza virus H3N2) వైరస్ ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఇప్పటికే గుర్తించింది. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ (Influenza virus H3N2) గురించి కొన్ని విషయాలు మీకోసం.
H3N2 virus | వేసవి ప్రవేశిస్తున్న ప్రస్తుత సమయంలో దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరు జలుబు, దగ్గు, వైరల్ జ్వరాల బారిన పడటం కలవరపెడుతోంది. కొవిడ్ తరహా లక్షణాలున్న ఈ వ్యాధులకు ‘ఇన్‌ఫ్లూయెంజా-ఏ ఉప రకం హెచ్3ఎన్2’ (Influenza virus H3N2) వైరస్ ప్రధాన కారణమని భారత వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్) ఇప్పటికే గుర్తించింది. అయితే, ఈ వైరస్ కొవిడ్ (Covid-19)లా వ్యాపిస్తోందని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్‌ఫ్లూయెంజా వైరస్ (Influenza virus H3N2) గురించి కొన్ని విషయాలు మీకోసం.
ఇన్‌ఫ్లూయెంజా హెచ్3ఎన్2 వైరస్ అంటే..?
H3N2 వైరస్ అనేది ఇన్‌ఫ్లూయెంజా-ఏ ఉప రకం వైరస్ ( influenza A virus). ఇది శ్వాసకోశ వైరల్ ఇన్ఫెక్షన్. ఈ వైరస్ 1968లో మనుషుల్లో బయటపడింది. H3N2 అనేది ఇన్‌ఫ్లూయెంజా-ఏ వైరస్ యొక్క రెండు ప్రోటీన్ జాతుల కలయిక. ఈ వైరస్ హెబగ్లుటినిన్ (hemagglutinin) (HA), న్యూరామినిడేస్ (neuraminidase ) (NA) యొక్క ప్రోటీన్ జాతుల (protein strains) నుంచి వచ్చింది. హెచ్ఏ (HA) అనేది 18కి పైగా విభిన్న ఉపరకాలను (subtypes) కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కటీ H1 నుంచి H18 వరకు ఉంటుంది. ఇక NA కి 11 విభిన్న ఉపరకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటీ N1 నుంచి N11 వరకు ఉంటాయి.
హెచ్3ఎన్2 వైరస్ లక్షణాలు..
జ్వరం, జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తుమ్ములు, తలనొప్పి, చలి, గొంతులో గరగర, ముక్కు కారడం, అలసట, అతిసారం, వాంతులు, ఊపిరి ఆడకపోవడం వంటివి ఈ వైరస్ లక్షణాలు.
ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
కొవిడ్ (Covid-19) తరహాలోనే ఈ వైరస్ కూడా ఒకరి నుంచి ఒకరికి చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఇంట్లో ఒకరికి వస్తే మిగతావారికీ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను కలిసి వారి సూచన మేరకు మందులు వేసుకోవాలి. ఒకవేళ కేవలం జలుబు, దగ్గు ఉంటే మొదటి రెండు మూడు రోజులు వేచి చూడొచ్చు. కానీ, జ్వరం, విరేచనాలు కూడా మొదలైతే మాత్రం వెంటనే డాక్టరును కలవాలి.
ఈ వైరస్ సోకితే రద్దీ ప్రాంతాలకు దూరంగా ఉండాలి. మాస్క్ ధరించాలి. చేతుల్ని తరచూ సబ్బుతో కడుక్కోవాలి. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇతరులకు వైరస్ సోకకుండా ఉంటుంది. మీరు తుమ్మినా లేదా దగ్గినా వైరల్ ఇన్ఫెక్షన్ ఇతరులకు సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని మీ నోటిని, ముక్కుని మాస్క్‌తో కప్పుకోవడం మంచిది.
వైద్యులు సూచించినట్లు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి. మంచి ఆహారం తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగితే వైరస్‌లను ఎదుర్కొనే వీలుంటుంది. గోరువెచ్చని నీరు తాగాలి. తాజా, వేడి ఆహారమే తీసుకోవాలి.
యాంటీబయాటిక్స్ వేసుకోకూడదా..?
హెచ్3ఎన్2 వైరస్ మ్యుటేట్ అయింది. ఏటా ఇదే సమయంలో వైరస్ రూపాంతరం చెందుతూ వస్తోంది. దీన్ని యాంటీజెనిక్ డ్రిఫ్ట్ (antigenic drift) అంటారు. గతంలో వచ్చిన H1N1 వైరస్ ఇప్పుడు H3N2గా రూపాంతరం చెందింది. ఈ వైరస్ కారణంగా వచ్చే దగ్గు కనీసం మూడు వారాలు ఉంటుంది. యాంటీబయాటిక్స్ వేసుకున్నా తగ్గదు. దీంతో రోగులు తీవ్ర గందరగోళానికి గురవుతారు.
ఇలాంటి వైరస్‌లకు యాంటీబయాటిక్స్ తీసుకోకూడదని.. లక్షణాల మేరకు వైద్యులు చికిత్స చేస్తారని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ఈ వైరస్ కారణంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా సీజనల్ వ్యాధులు (seasonal flu) పెరుగుతున్నాయని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (Indian Medical Association) (ఐఎంఏ) తెలిపింది. జలుబు, జ్వరం, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు (seasonal flu) యాంటీబయాటిక్స్ (Antibiotics) ఔషధాలు తీసుకోవడం సరికాదని పేర్కొంది. జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, వికారం, వాంతులు, జ్వరం ఇవన్నీ సాధారణమేనని పేర్కొంది. సీజనల్ జ్వరం ఐదు నుంచి ఏడు రోజుల వరకు ఉంటుందని తెలిపింది. సాధారణ జ్వరం మూడు రోజుల్లో తగ్గిపోతుందని చెప్పింది. అయితే దగ్గు మాత్రం మూడు వారాల వరకు ఉంటుందని పేర్కొంది. రోగులకు యాంటీబయాటిక్స్ (Antibiotics) ఔషధాలు సూచించే ముందు సదరు ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వల్ల వచ్చిందా? కాదా? అన్నది వైద్యులు నిర్ధారించుకోవాలని సూచించింది. లక్షణాల ఆధారంగా చికిత్స ఇవ్వాలని పేర్కొంది. ఈ దగ్గు, జలుబు వంటి వాటికి యాంటీబయాటిక్స్ (Antibiotics) అవసరం లేదని స్పష్టం చేసింది.
Also Read..
Randeep Guleria | కొవిడ్‌లా పాకుతున్న ఇన్‌ఫ్లూయెంజా వైరస్ : రణదీప్ గులేరియా
Rajasthan | రెండు గుండెలు, నాలుగు కాళ్లు, చేతులతో.. వింత శిశువు జననం..!
United Airlines | విమానం గాల్లో ఉండగానే ఎమర్జెన్సీ డోర్ తెరవబోయిన ప్రయాణికుడు..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

