United Airlines | లాస్ఏంజెల్స్ (Los Angeles) నుంచి బోస్టన్ (Boston) వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో (United Airlines flight) ఓ ప్రయాణికుడు హల్చల్ చేశాడు. విమానం గాల్లో ఉండగా అత్యవసర ద్వారాన్ని (Emergency Door ) తెరవబోయాడు. గమనించిన సిబ్బంది అతన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన గత ఆదివారం చోటు చేసుకుంది.
యునైటెడ్ ఎయిర్‌లైన్స్ (United Airlines)కు చెందిన ఓ విమానం ఆదివారం లాస్ ఏంజెల్స్ (Los Angeles) నుంచి బోస్టన్ (Boston)కు బయల్దేరింది. విమానం మరో 45 నిమిషాల్లో ల్యాండ్ అవుతుందనగా.. అందులోని ఓ ఎమర్జెన్సీ డోర్ (Emergency Door ) అన్‌లాక్ అయినట్లు కాక్‌పిట్ (cockpit)లో అలారమ్ మోగింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది (flight crew ) తనిఖీలు చేయగా.. డోర్ లాకింగ్ హ్యాండిల్ (locking handle)ను ఎవరో లాగినట్లు కనిపించింది. వెంటనే సిబ్బంది ఆ డోర్ లాకింగ్‌ను సరిచేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఆ సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ (Emergency Door) వద్ద కొంతసేపు ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది.. ఈ విషయంపై అతన్ని ప్రశ్నించారు. అయితే, అతడు సిబ్బందితో గొడవకు దిగాడు. అంతటితో ఆగకుండా సిబ్బందిలోని ఒకరిపై చేయి చేసుకున్నాడు. పదునైన వస్తువుతో పొడిచేందుకు ప్రయత్నించాడు. విమానంలోని తోటి ప్రయాణికులు గమనించి అతడిని అడ్డుకున్నారు. అనంతరం విమానం బోస్టన్‌లో ల్యాండ్ కాగానే ఘటనపై సిబ్బంది ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు ఆ ప్రయాణికుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని మసాచుసెట్స్ (Massachusetts)కు చెందిన 33 ఏండ్ల ఫ్రాన్సిస్కో సెవెరో టోరెస్ (Francisco Severo Torres )గా గుర్తించారు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
Also Read..
Randeep Guleria | కొవిడ్‌లా పాకుతున్న ఇన్‌ఫ్లూయెంజా వైరస్ : రణదీప్ గులేరియా
Rajasthan | రెండు గుండెలు, నాలుగు కాళ్లు, చేతులతో.. వింత శిశువు జననం..!
Hardik Pandya | పాండ్యా అరుదైన రికార్డు.. దిగ్గజాలను దాటుకుని