పురుషుల్లో భావప్రాప్తి.. ఈ విషయాలు మీకు తెలుసా..?
Male Orgasm | శృంగార ప్రక్రియ ఓ మధురానుభూతిని కలిగిస్తోంది. తనువంతా తన్మయత్వం చెందుతోంది. ప్రేమానురాగాలను పెంచుతోంది. మరి ఆ ఆనంద క్షణాల్లో భావప్రాప్తి పొందితే శృంగార జీవితానికి ఎలాంటి ఆటంకాలు ఉండవు. ఆనందంగా జీవితం సాగిపోతోంది. సంసారం మూడు పువ్వులు ఆరు కాయాలుగా వర్ధిల్లుతోంది.
శృంగార ప్రక్రియలో భావప్రాప్తి అనేది అత్యంత ప్రధానం. పలు అవయవాలు ఆడవారిలో భావప్రాప్తిని కలిగిస్తాయి. మరి పురుషుడిలో ఏ అవయవం భావప్రాప్తిని కలిగిస్తోంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో కొందరు స్కలనం జరిగితే భావప్రాప్తి పొందుతారు. కొందరికి స్కలనం జరగకున్నా భావప్రాప్తి పొందుతారు. ఇలాంటి సందర్భాల్లో పురుషుడి శరీరంలోనూ భావప్రాప్తి కలిగించే అవయవం ఒకటి ఉందనే విషయం తెలుసుకోవాలి.
కొన్ని సార్లు పురుషుల్లో ఒకేసారి స్కలనం, భావప్రాప్తి పొందడం జరుగుతాయి. ఈ ప్రక్రియ అందరి పురుషుల్లోనూ ఒకేలా ఉంటుందని చెప్పలేం. అయితే స్త్రీ శరీరంలో కామోద్రేకాలను కలిగించే అవయవాలు ఉన్నట్లే పురుషుడి శరీరంలోనూ ఓ అవయవం ఉంది. అదే ప్రోస్టేట్ గ్లాండ్(పౌరుష గ్రంథి). ఈ గ్రంథి వల్ల పురుషుడు భావప్రాప్తి పొందుతాడని అధ్యయనాల్లో తేలింది. ప్రోస్టేట్ గ్లాండ్ వాల్ నట్ సైజులో ఉండి.. పురుషాంగం, మూత్రాశయానికి మధ్యలో ఉంటుంది. పౌరుష గ్రంథి సీమెన్‌ను ఉత్పత్తి చేస్తోంది. శుక్ర కణాలు ఉత్పత్తి అయి స్కలనం జరిగినప్పుడు భావప్రాప్తి పొందుతారు. ప్రోస్టేట్ గ్లాండ్స్ చాలా సున్నితమైనవి. ప్రొస్టేట్ గ్లాండ్‌ను పురుషుడి కామోద్రేక అవయవంగా పరిగణిస్తారు.
అయితే శృంగార సమయంలో స్త్రీ, పురుషులిద్దరూ భావప్రాప్తి పొందినప్పుడు.. గుండె వేగంగా కొట్టుకుంటోంది. రక్తప్రసరణ అధికమవుతోంది. పురుషులకు తొందరగా భావప్రాప్తి కలుగుతుంది. స్త్రీలలో పురుషుడి కంటే 20 సెకన్లు ఆలస్యంగా భావప్రాప్తి కలుగుతుంది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజులతో పురుషులు స్కలనం తొందరకాకుండా నియంత్రించుకోవచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
వరి రకాల మినీకిట్లపై రైతుల అభిప్రాయ సేకరణ
CM Vijay | తమిళనాడు సీఎం విజయ్‌కి మద్రాస్ హైకోర్టులో చుక్కెదురు..!
ట్రెండింగ్ వార్తలు
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!

