కంటిపాపకు ఆయుర్వేద రక్ష
కండ్లు పొడిబారడాన్ని కెరాటోకంజంక్టివైటిస్ సిక్కా అని కూడా అంటారు. కండ్లు తేమగా ఉండటానికి అశ్రుగ్రంథుల నుంచి తగినన్ని నీళ్లు విడుదల కాకపోవడం, విడుదలైనా అవి తొందరగా ఆవిరి కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది.
కండ్లు పొడిబారడాన్ని కెరాటోకంజంక్టివైటిస్ సిక్కా అని కూడా అంటారు. కండ్లు తేమగా ఉండటానికి అశ్రుగ్రంథుల నుంచి తగినన్ని నీళ్లు విడుదల కాకపోవడం, విడుదలైనా అవి తొందరగా ఆవిరి కావడం వల్ల ఈ సమస్య తలెత్తుతుంది. ఇది… కండ్లు పొడిబారడం, దురదగా ఉండటం, ఎర్రబడటం, గరగరగా అనిపించడం, కొన్నిసార్లు చూపు మసకగా ఉండటం లాంటి ఇబ్బందులకు దారితీస్తుంది.
వయసు పెరగడం, హార్మోన్లలో మార్పులు, ఎక్కువకాలం పాటు స్క్రీన్లకు అతుక్కుపోవడం, వాతావరణం పొడిగా ఉండటం, కొన్ని ప్రత్యేకమైన వైద్య సమస్యలు ఈ డ్రై ఐస్ సమస్యకు కారణాలు. కాగా, భారతీయ పురాతన వైద్య సంప్రదాయం ఆయుర్వేదంలో డ్రై ఐస్ లక్షణాలను తగ్గించడానికి, కంటిచూపు మెరుగుపర్చడానికి కొన్ని సహజమైన పరిష్కారాలు ఉన్నాయి.

కలబందలో మాయిశ్చరైజింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. కొంచెం కలబంద గుజ్జు (జెల్) తీసుకుని, దాన్ని కంటి చుట్టూ అప్లయ్ చేస్తే పొడిబారే సమస్య నుంచి ఉపశమనం దొరుకుతుంది. అయితే, ఈ గుజ్జు కండ్లకు తాకకుండా జాగ్రత్త వహించాలి.
శుభ్రంగా ఉన్న గుడ్డను తీసుకుని చల్లటి రోజ్ వాటర్‌లో ముంచాలి. దాన్ని ఓ పది పదిహేను నిమిషాలపాటు కండ్లు మూసి, కనురెప్పలపై ఉంచాలి. రోజ్ వాటర్‌కు కండ్లను చల్లబరిచే, మంట నుంచి ఉపశమనం కలిగించే గుణాలు ఉంటాయి. దీంతో కండ్లు పొడిబారడం, మంట తగ్గుతాయి.

మూసిన కండ్లపై కీరదోస చక్రాలను ఉంచినా కూడా డ్రై ఐస్, మంట సమస్యల నుంచి సత్వరమే ఉపశమనం లభిస్తుంది. సహజమైన యాంటీ ఆక్సిడెంట్లు, నీళ్ల శాతం ఎక్కువగా ఉండే కీరదోస చక్రాలను కండ్ల మీద ఓ 20 నిమిషాల వరకు ఉంచాలి.
గానుగ పట్టించిన ఆముదపు నూనెను ఒకచుక్క తీసుకుని కంటి చుట్టూ గుండ్రంగా రుద్దాలి. ఆముదపు నూనెకు లూబ్రికేటింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి డ్రై ఐస్ సమస్యను తగ్గిస్తాయి.
నిర్ణీత సమయాల వ్యవధిలో కనురెప్పలు కొట్టడం కూడా కంటికి తగినంత తేమను అందిస్తుంది. కండ్లు పొడిబారడాన్ని నివారిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ కాలంపాటు స్క్రీన్లను చూసేవాళ్లు ఇలా చేయడం ఎంతో మంచిది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

