కండ్లు పొడిబారుతున్నాయా?
కండ్లలో నీళ్లు ఉత్పత్తి కానప్పుడు, ఊరిన నీళ్లు వెంటనే ఆవిరైపోయి తగినంత తడి లేనప్పుడు మనకు కండ్లు పొడిబారే సమస్య ఏర్పడుతుంది. చాలామందిలో కనిపించే ఈ సమస్య కొన్నిసార్లు రోజువారీ పనులకు ఇబ్బందికరంగా మారుతుంది.
కండ్లలో నీళ్లు ఉత్పత్తి కానప్పుడు, ఊరిన నీళ్లు వెంటనే ఆవిరైపోయి తగినంత తడి లేనప్పుడు మనకు కండ్లు పొడిబారే సమస్య ఏర్పడుతుంది. చాలామందిలో కనిపించే ఈ సమస్య కొన్నిసార్లు రోజువారీ పనులకు ఇబ్బందికరంగా మారుతుంది. దీని కారణంగా కండ్లలో మంట, ఎర్రబారడం, కాంతిని తట్టుకోలేకపోవడం, గరగరగా ఉండటం లాంటివి సంభవిస్తాయి. వాతావరణ పరిస్థితులు, ఎక్కువ సమయంపాటు స్క్రీన్లకు అతుక్కుపోవడం, ఇతర ఆరోగ్య సమస్యలు… ఎలా వచ్చినాసరే డ్రై ఐస్‌కు తగిన చికిత్స తీసుకోవాలి. అయితే, కొన్ని ఉపశమన చర్యల ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.
తగినన్ని నీళ్లు: శరీర ఆరోగ్యానికి తగినన్ని నీళ్లు తాగడం చాలా అవసరం. రోజులో తగిన మోతాదులో నీళ్లు తాగుతూ ఉంటే కన్నీళ్ల ఉత్పత్తికి సహకరిస్తుంది. అలా కండ్లు పొడిబారడాన్ని నివారించవచ్చు.
కంటిచుక్కలు: మందుల దుకాణాల్లో దొరికే ఐ డ్రాప్స్ కండ్లలో తగినంత తడిని ఉంచి పొడిబారకుండా చూస్తాయి. అయితే వీటిలో ప్రిజర్వేటివ్స్ లేనివాటిని ఎంచుకోవాలి. ప్యాక్మీదున్న సూచనలు పాటించాలి.
రెప్పలు వాల్చడం: ఎక్కువసేపు డిజిటల్ తెరలకు అతుక్కుపోవడంతో రెప్పలు వాల్చడం తగ్గిపోతుంది. దీంతో కండ్లు పొడిబారిపోతాయి. కాబట్టి, కంప్యూటర్లు, స్మార్ట్ఫోన్లు, ఇతర డిజిటల్ పరికరాలను చూస్తున్నప్పుడు తరచుగా రెప్పలు కొడుతూ ఉండాలి.
తెరలకు దూరంగా: కండ్ల మీద ఒత్తిడి తగ్గడానికి, పొడిబారకుండా ఉండటానికి తెరలకు ఎక్కువసేపు అంటుకుపోకూడదు. దీనికోసం 20 20 20 నియమం అనుసరించాలి. ప్రతి ఇరవై నిమిషాలకోసారి 20 సెకండ్లు బ్రేక్ తీసుకోవాలి. ఈ సమయంలో 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుమీద దృష్టి సారించాలి.
హ్యుమిడిఫయర్ వాడటం: గదుల్లో ఫ్యాన్ల నుంచి వీచే గాలి కండ్లను పొడిబారుస్తుంది. హ్యుమిడిఫయర్లను వాడటం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు.
దుమ్మునుంచి రక్షణ: బయటికి వెళ్లినప్పుడు గాలి, దుమ్ము, ఎండ నుంచి కండ్లను కాపాడుకోవడానికి సన్‌గ్లాసెస్ లేదా గాగుల్స్ వాడటం మంచిది.
మంచి ఆహారం: ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు, అవిసెగింజలు, వాల్నట్స్ లాంటివి ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి కండ్లలో మంటను తగ్గిస్తాయి. కన్నీటి నాణ్యతను పెంచుతాయి. అదనంగా విటమిన్ ఎ, సి, ఇ తగిన మోతాదులో ఉన్న ఆహారం తీసుకోవాలి.
ఎన్ని రక్షణ చర్యలు చేపట్టినా ఇబ్బంది అలానే ఉంటే కంటి వైద్యుణ్ని సంప్రదించాలి. కండ్లు పొడిబారడానికి కారణం తెలుసుకుని తగిన చికిత్స తీసుకోవాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

