మూడు కప్పుల కాఫీ, టీ ముద్దు.. లేదంటే స్ట్రోక్ తప్పదు..
రోజులో 2-3 కప్పులకు మించకుండా చూసుకోవాలని సెలవిస్తున్నారు పరిశోధకులు. టీ, కాఫీలను మితంగా తీసుకుందాం.. స్ట్రోక్ ముప్పు నుంచి బయటపడదాం...
మన దైనందిన జీవితంలో కాఫీ, టీలు భాగంగా మారిపోయాయి. ఉదయాన్నే టీ తాగందే మనలో చాలా మందికి ఏదీ తోచదు. టీ, కాఫీ విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అలవాటు. కొందరు టీ, కాఫీలు అమితంగా తీసుకుంటుండగా.. ఇంకొందరు రోజుకు 1-2 సార్లు మాత్రమే తాగుతారు. ఎక్కువ సార్లు టీ, కాఫీలు తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెప్తుండగా.. రోజులో 2-3 కప్పులకు మించకుండా చూసుకోవాలని సెలవిస్తున్నారు పరిశోధకులు.
టీ, కాఫీలలో ఉండే రసాయనాలు శరీరానికి చాలా ప్రయోజనాలను కలిగిస్తాయి. మన నాడీ వ్యవస్థను చురుకుగా ఉంచుతాయి. అలసటను తొలగించడంలో కూడా సాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మానసిక స్థితి బాగుంటుంది.. ఉత్పాదకత కూడా పెరుగుతుంది. బ్రిటన్‌లో నిర్వహించిన ఒక పరిశోధన ప్రకారం, సరైన మోతాదులో కాఫీ, టీ తాగడం వల్ల స్ట్రోక్, డిమెన్షియా వంటి ఆరోగ్య సమస్యల రిస్క్ తగ్గుతుంది.
పీఎల్ఓఎస్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించిన ఈ పరిశోధనలో 3.65 లక్షల మంది బ్రిటిష్ పౌరులు పాల్గొన్నారు. 50-74 సంవత్సరాల వయసు వారి టీ, కాఫీ అలవాట్లపై అధ్యయనం జరిపారు.
రోజూ 2-3 కప్పుల కాఫీ, 2-3 కప్పుల టీ తాగేవారిలో స్ట్రోక్ ముప్పు 32 శాతం తక్కువగా ఉంటుందని తమ పరిశోధనలో తేల్చారు. ఇలాంటి వారిలో చిత్తవైకల్యం (డిమెన్షియా) వచ్చే ప్రమాదం 28 శాతం తక్కువగా ఉంటుందని చెప్పారు.
సరైన మోతాదుతో లాభం..
టీ, కాఫీలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ..
- నిద్రలేమి
- ఆందోళన
- కడుపు సమస్యలు
- హృదయ స్పందనలో మార్పులు
- అధిక రక్తపోటు
- అశాంతి
- అలసట
- గుండెలో మంట
- తలనొప్పి
- గర్భధారణ సమయంలో ఇబ్బందులు వంటి ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని టీ, కాఫీలను మితంగా తీసుకుందాం.. స్ట్రోక్ ముప్పు నుంచి బయటపడదాం.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

