సుఖ ప్రసవానికి..
సహజ ప్రసవం అత్యుత్తమని, సురక్షితమని డాక్టర్లు చెబుతున్నారు. వైద్యపరంగా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే సిజేరియన్ వైపు మొగ్గు చూపాలి. గర్భిణుల విషయంలో రెండోనెల నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ప్రసవం సహజంగా జరుగుతుంది.
సహజ ప్రసవం అత్యుత్తమని, సురక్షితమని డాక్టర్లు చెబుతున్నారు. వైద్యపరంగా తప్పనిసరి అయినప్పుడు మాత్రమే సిజేరియన్ వైపు మొగ్గు చూపాలి. గర్భిణుల విషయంలో రెండోనెల నుంచే జాగ్రత్తలు తీసుకుంటే ప్రసవం సహజంగా జరుగుతుంది. తల్లీబిడ్డ క్షేమంగా ఉంటారు. తక్షణమే బిడ్డకు ముర్రుపాలు పట్టే అవకాశం ఉంటుంది. పసికందుకు శ్వాసకోశ సమస్యలూ రావు. కాబోయే తల్లి ఆహారం, ఆరోగ్యం, వ్యాయామం.. తదితర విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి..
- గర్భధారణకు ముందే సంపూర్ణ వైద్య పరీక్షలు చేయించడం ఉత్తమం. మధుమేహం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ తదితర సమస్యలు ఉన్నప్పుడు.. అవసరమైన వైద్యం తీసుకోవచ్చు.
- పోషకాల లోపాన్ని సరిచేసుకుంటూ.. డాక్టర్ల సలహా ప్రకారం తగిన ఆహారం ఇవ్వాలి.
- గర్భిణుల కోసం ప్రత్యేకంగా కొన్ని వ్యాయామాలు ఉన్నాయి. నిపుణుల సాయంతో వాటిని నిత్యం సాధన చేయించాలి.
- మూఢ నమ్మకాలతో డెలివరీ తేదీని ముందే నిర్ణయించుకుని.. సిజేరియన్‌కు వెళ్లడమూ సరికాదు.
- ఆడపిల్లే కావాలని కోరుకోవడంలో తప్పులేదు. మగబిడ్డే పుట్టాలని ఆశించడమూ నేరం కాదు. కానీ కాబోయే తల్లి మీద ఒత్తిడి పెంచడం వల్ల ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. గర్భిణి ఎంత ఉల్లాసంగా ఉంటే.. డెలివరీ అంత సజావుగా జరుగుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

