Healthy Food | హెల్తీ పుడ్ నిజంగానే అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలను అందిస్తాయా..? నిపుణులు ఏమంటున్నారు..?
నేటి వెల్నెస్ ట్రెండ్‌లో హెల్తీ ఫుడ్ అనే పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఎన్నో ఆహార పదార్థాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రోటీన్ బార్లు, ఫ్లేవర్డ్ యోగర్టులు, సూపర్‌ఫుడ్ స్మూతీలు, విత్తనాలు, సప్లిమెంట్లతో నిండిన పానీయాలు ఆరోగ్యకరమైన ఎంపికలుగా ప్రచారం పొందుతున్నాయి.
Healthy Food | నేటి వెల్నెస్ ట్రెండ్‌లో హెల్తీ ఫుడ్ అనే పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఎన్నో ఆహార పదార్థాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రోటీన్ బార్లు, ఫ్లేవర్డ్ యోగర్టులు, సూపర్‌ఫుడ్ స్మూతీలు, విత్తనాలు, సప్లిమెంట్లతో నిండిన పానీయాలు ఆరోగ్యకరమైన ఎంపికలుగా ప్రచారం పొందుతున్నాయి. అయితే, పేగుల ఆరోగ్యానికి వస్తే ప్రతి హెల్తీ ఆహారం అందరికీ ఒకే విధంగా ప్రయోజనం చేకూర్చదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతి వ్యక్తి శరీరంలోని మైక్రోబయోమ్ భిన్నంగా ఉండటంతో ఆహారాలపై ప్రతిస్పందన కూడా వేరుగా ఉంటుంది. పేగుల్లో లక్షల కోట్ల సూక్ష్మజీవులు నివసిస్తుంటాయి. ఇవి రోగనిరోధక శక్తి, జీవక్రియలు, వాపు నియంత్రణ వంటి అనేక కీలక ప్రక్రియలను ప్రభావితం చేస్తాయి. అందుకే ఒకరికి మేలు చేసే ఆహారం మరొకరికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యకరమని ప్రచారం చేసే ఆహార పదార్థాలు అందరికీ సమానంగా ప్రయోజనకరమని భావించడం ప్రస్తుతం ఉన్న అతిపెద్ద అపోహగా నిపుణులు చెబుతున్నారు.
ప్యాకేజ్డ్ హెల్తీ ఫుడ్స్..
ముఖ్యంగా ప్యాకేజ్డ్ హెల్త్ ఫుడ్స్‌లో ఉండే కొన్ని పదార్థాలు జీర్ణవ్యవస్థకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. ప్రోటీన్ బార్లు, షుగర్-ఫ్రీ స్నాక్స్, ఫ్లేవర్డ్ యోగర్ట్‌లలో ఎమల్సిఫైయర్లు, గమ్స్, షుగర్ ఆల్కహాల్స్, ప్రిజర్వేటివ్స్ వంటి పదార్థాలు ఉంటాయి. కొందరు వ్యక్తుల పేగుల్లోని సూక్ష్మజీవుల సమతుల్యత ఈ పదార్థాలను సరిగా తట్టుకోదు. ఫలితంగా కడుపు ఉబ్బరం, జీర్ణక్రియలో అసమానతలు, దీర్ఘకాలిక స్వల్పస్థాయి వాపు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. సహజ ఆహారాలు కూడా అందరికీ ఒకే విధంగా సరిపోవని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు క్యాబేజీ, బ్రోకోలీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను అధికంగా తీసుకుంటే వాటిని జీర్ణం చేసే సామర్థ్యం తక్కువగా ఉన్నవారిలో జీర్ణ సమస్యలు కనిపిస్తాయి. అలాగే చియా విత్తనాలు, ప్రోటీన్ పౌడర్లు, అడాప్టోజెన్లు, ఫ్రోజన్ ఫ్రూట్స్ కలిపి తయారు చేసే స్మూతీలు కూడా కొందరికి జీర్ణక్రియను మరింత కష్టతరం చేస్తుంది.
ఇది పాటించాలి..
అందువల్ల ఒక ఆహారం సిద్ధాంతపరంగా ఆరోగ్యకరమా కాదా అన్న దానికంటే, అది వ్యక్తిగతంగా శరీరానికి అనుకూలమా కాదా అన్నదే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఒకే ఆహారం తీసుకున్నప్పటికీ పూర్తిగా భిన్నమైన ఫలితాలు అనుభవిస్తారు. ఈ తేడాకు ప్రధాన కారణం వారి పేగుల్లోని మైక్రోబయోమ్ నిర్మాణమే. ఇటీవల వెల్నెస్ ట్రెండ్స్ పేరుతో అనేక పోషక పదార్థాలను ఒకేసారి అధికంగా తీసుకోవడం పెరిగింది. అయితే ఎక్కువైతే మంచిదే అనే భావన పేగుల ఆరోగ్యానికి ఎప్పుడూ వర్తించదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పేగులు వైవిధ్యభరితమైన, సమతుల్యమైన, క్రమబద్ధమైన ఆహార విధానాన్ని ఇష్టపడతాయి. ప్రతిరోజూ కొత్త ట్రెండ్లను అనుసరించడం కంటే, శరీరం ఏ ఆహారాలను సులభంగా జీర్ణించగలదో, వేటిని తట్టుకోలేదో అర్థం చేసుకోవడం ఆరోగ్యపరంగా మరింత తెలివైన నిర్ణయంగా చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
SlumDog 33 Temple Road | షూటింగ్ పూర్తి చేసుకున్న పూరి- విజయ్ సేతుపతి ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్!
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

