Weight loss | శరీరం బరువు తగ్గించుకునేందుకు సరికొత్త చికిత్స..
weight loss | ఒకప్పుడు క్యాన్సర్, క్షయ వంటి క్లిష్టతరమైన వ్యాధులను డీకోడింగ్ చేసేందుకు మాత్రమే డీఎన్ఏ ప్రొఫైలింగ్ చేపట్టేవారు. అయితే, ఆరోగ్యకరమైన జీవనశైలికి తెలివైన విధానాన్ని అందించేందుకు ఈ డీఎన్ఏ ప్రొఫైలింగ్ పరీక్షలు...
weight loss | రాధిక అనే 25 ఏండ్ల యువతి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఈమె సమస్యంతా ఆమె శరీరం బరువే. శరీరం బరువు తగ్గించుకునేందుకు ఎన్నో డైట్లను పాటించింది. వ్యాయామాలు చేసింది. ఉపవాసాలకు పూనుకున్నది. నాన్‌వెజ్ పూర్తిగా మానేసింది. అయినా సమస్య సమస్యగానే ఉన్నది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలనే ఆలోచనతో గూగుల్‌లో వెతికింది. అంతే..! ఆమె సంతోషానికి అవధుల్లేవు. ఉమ్మి ఆధారిత డీఎన్ఏ వెల్నెస్ పరీక్ష గురించిన కొత్త సమాచారం చదివింది. ఆ ఆర్టికల్‌లో చెప్పిన విధంగా ఫాలో అయి ఇప్పుడు నాజూగ్గా తయారైంది. రాధిక ఒక్కరే కాదు.. మన దేశంలో ఎందరో యువతులు శరీరం బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారికి సూచనలు చేసేందుకు ఈ ఉమ్మి ఆధారిత పరీక్షలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
ఒకప్పుడు క్యాన్సర్, క్షయ వంటి క్లిష్టతరమైన వ్యాధులను డీకోడింగ్ చేసేందుకు మాత్రమే డీఎన్ఏ ప్రొఫైలింగ్ చేపట్టేవారు. అయితే, ఆరోగ్యకరమైన జీవనశైలికి తెలివైన విధానాన్ని అందించేందుకు ఈ డీఎన్ఏ ప్రొఫైలింగ్ పరీక్షలు సహాయపడుతున్నాయి. జెనెటిక్ టెస్టింగ్ అనేది ఒకప్పుడు అభివృద్ధి చెందిన దేశాలకే పరిమితమైంది. ఇప్పుడు మన దేశంలో కూడా అందుబాటులో ఉండటంతో ఎక్కువ సంఖ్యలో పరీక్షలు జరుగుతున్నాయి. డీఎన్ఏ టెస్టింగ్ ఫర్ ఫుడ్ అనే దానిని న్యూట్రిజెనోమిక్స్ లేదా వ్యక్తిగతీకరించిన పోషకాహారంగా వైద్యపరిభాషలో చెప్తుంటారు. మన శరీరం ఆహారం, పోషకాలకు ప్రత్యేకమైన రీతిలో ఎలా స్పందిస్తాయనేది ఈ టెస్టింగ్‌లో చెప్తుంది. అయితే, అందరికీ ఒకే రకమైన ఆహారం పనిచేయదని గుర్తుంచుకోవాలి.
శరీరం బరువు తగ్గడం, రక్తపోటు నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గించడం, గట్ ఆరోగ్యం వంటి విషయాలకు మన ఆహార విధానాన్ని ఎలా మార్చుకోవాలో డీఎన్ఏ పరీక్ష సహాయపడుతుంది. వెల్నెస్ పరీక్ష ఆరోగ్యానికి సంబంధించి నాలుగు అంశాలను కవర్ చేస్తుంది. అవి.. ఆహారం, బరువు, చర్మం, ఫిట్నెస్, డిటాక్సిఫికేషన్. ఇది సదరు వ్యక్తి జన్యు డాటాను విశ్లేషించి ప్రత్యేకంగా రూపొందించే జీవనశైలిని అందించడంలో సహాయపడుతుంది. ఈ జన్యు పరీక్ష ఒక వ్యక్తి యొక్క జన్యువులు, క్రోమోజోమ్‌ల గురించిన సమాచారాన్ని అందిస్తుంది. అలాగే ఖచ్చితమైన సమస్యను గుర్తించి మార్పులను సూచించడంలో సహాయపడుతుంది. మెరుగైన ఫలితాలను అందిస్తూనే అనవసర తనిఖీలు, స్క్రీనింగ్‌ల అవసరాన్ని తప్పిస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

