Healthy heart: ఇది లేకుంటే గుండెకు ముప్పే..అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అధ్యయనంలో వెల్లడి!
కరోనా సంక్షోభం తర్వాత చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది ఈ సమస్యతోనే మరణిస్తున్నారు. కాగా, ఈ గుండె సమస్యలకు ప్రధాన కారకాన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) పరిశోధకులు కనుగొన్నారు. మానసిక ఆరోగ్యం నుంచి శరీర బరువు, జీవక్రియ వరకు శరీరం అన్ని ప్రక్రియలు, విధులకు అవసరమైన నిద్ర.. గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని ఏహెచ్ఏ తేల్చింది.
కరోనా సంక్షోభం తర్వాత చాలామంది గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. ఎక్కువ మంది ఈ సమస్యతోనే మరణిస్తున్నారు. కాగా, ఈ గుండె సమస్యలకు ప్రధాన కారకాన్ని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) పరిశోధకులు కనుగొన్నారు. మానసిక ఆరోగ్యం నుంచి శరీర బరువు, జీవక్రియ వరకు శరీరం అన్ని ప్రక్రియలు, విధులకు అవసరమైన నిద్ర.. గుండె ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని ఏహెచ్ఏ తేల్చింది.
నిద్ర నాణ్యత, వ్యవధి అనేది గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తునందని ఏహెచ్ఏ పేర్కొంది. నిద్రతో 80 శాతం గుండె జబ్బులను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు. టీనేజర్లు, యుక్తవయస్కులకు 8-10 గంటల నిద్ర, పెద్దలకు 7-8 గంటల నిద్ర తప్పనిసరని సూచిస్తున్నారు.
కౌమారదశలో ఎందుకు ఎక్కువ నిద్రలేమికి గురవుతారు?
కౌమారదశలో ఉన్నవారు ఎక్కువగా నిద్రలేమికి గురవుతున్నట్లు పరిశోధకులు తేల్చారు. స్కూల్ సమయం వల్ల ఆలస్యంగా పడుకోవడం, తొందరగా నిద్రలేవడం వల్ల వారి జీవగడియారంలో మార్పు వస్తున్నదని గుర్తించారు. ఫలితంగా వారు దీర్ఘకాలికంగా నిద్రలేమితో బాధపడుతున్నట్లు కనుగొన్నారు. స్కూల్ టైం లేట్ ఉన్న విద్యార్థులు మెరుగైన గ్రేడ్లు, మానసిక ఆరోగ్యంతోపాటు తక్కువ జ్వర ప్రమాదాలను కలిగి ఉంటారని తేలింది.
నిద్రలేమితో కలిగే ఇతర అనారోగ్య సమస్యలు
1. ఊబకాయం
హార్వర్డ్ హెల్త్ ప్రకారం.. యువకులు, పెద్దలు, పిల్లల్లో స్థూలకాయానికి నిద్ర లేకపోవడం ఒక ప్రధాన కారకం. ఇది జీవక్రియను మందగిస్తుంది. ఆకలి బాధలను ప్రేరేపిస్తుంది. బరువు తగ్గించే ప్రయత్నాలను అడ్డుకుంటుంది.
2. కొవిడ్ ప్రమాదం
కొవిడ్ రోగులు ఇన్ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత నిద్రలేమితో సతమతవుతున్నారు. వారిలో అలసట, సిర్కాడియన్ రిథమ్ రుగ్మతలు కనిపిస్తున్నాయి. నిద్రలేమితో రోగనిరోధకశక్తి తగ్గిపోతున్నది. దీంతో మళ్లీ కొవిడ్ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
3. మధుమేహం
నిద్రలేమితో వచ్చే మరో ఆరోగ్య సమస్య ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఒక వ్యక్తి రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణను కోల్పోవచ్చు. మదీర్ఘకాలంలో ఇది మధుమేహానికి కారణమవుతుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండ ఎన్జీ కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
‘నేల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి’
Accident | పెళ్లి జరగాల్సిన ఇంట్లో విషాదం.. వెడ్డింగ్ కార్డ్స్ పంచేందుకు వెళ్తుంటే..
Nithin | ‘అలియాస్ రుక్మిణి’లో యంగ్ లుక్లో నితిన్.. కృష్ణగా సరికొత్త అవతారం!
‘రామవరం ప్రజలకు స్థిరాస్తి పేరు మార్పిడికి అవకాశం కల్పించాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!

