న్యూయార్క్ : సెలబ్రిటీలైనా (Red LED Light therapy) వయసు మీద పడే కొద్దీ చర్మం మెరుపులు తగ్గడం, ముఖంపై, కళ్ల కింద ముడతలు రావడం వంటి వృద్ధాప్య ఛాయలు కనిపిస్తుంటాయి. వాటిని మేకప్‌తో మేనేజ్ చేసినా మునుపటి యవ్వనం తొణికిసలాడటం కష్టమే. అయితే టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ బ్యూటీ కేర్ రంగంలోనూ అద్భుత థెరఫీలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పుడు హాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ సెలబ్రిటీలు సౌందర్యాన్ని సంరక్షించుకునేందుకు అత్యాధునిక రెడ్ ఎల్ఈడీ లైట్ థెరఫీకి మొగ్గుచూపుతున్నారు.
యవ్వనం ఛాయలు కొనసాగుతూ అందాన్ని కాపాడుకునేందుకు ఈ బ్యూటీ థెరఫీని సెలబ్రిటీలు అనుసరిస్తున్నారు. 62 ఏండ్ల సెలబ్రిటీ జూలియన్ మూర్ ప్రస్తుతం మనం ఊహించిన దానికంటే మెరుగ్గా కనిపిస్తోంది. ఆమె మచ్చలేని చర్మం రహస్యం ప్రముఖులు ఆమోదించిన రెడ్ ఎల్ఈడీ లైట్ థెరపీనే.
ముఖంపై ముడతలు, స్కిన్‌పై మచ్చలను తొలగించి మెరిసే చర్మాన్ని అందించే థెరఫీగా పేరొందిన రెడ్‌లైట్ థెరఫీని హాలీవుడ్ భామ ఇటీవల అనుసరించింది. ఈ ట్రీట్మెంట్ వల్ల ఇన్ఫ్లమేషన్ వంటి సైడ్ ఎఫెక్ట్స్ సమస్యలు కూడా వెంటాడవని చెబుతుండటంతో సెలబ్రిటీలు ఈ మేనియాతో ఊగిపోతున్నారు. రెడ్‌లైట్ ఎల్ఈడీ థెరఫీతో మెరిసిపోయేందుకు బారులుతీరుతున్నారు. బాలీవుడ్ భామ దీపికా పదుకునే నుంచి పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఈ బ్యూటీ థెరఫీతో మెరిసిపోతున్నారు.
Read More :