Brushing Teeth | రోజుకు ఒక్కసారి బ్రష్ చేస్తే దంతాలకు నష్టమే.. ఎందుకంటే..?
రోజంతా అలసటతో రాత్రి దంతాలను బ్రష్ చేయడం చాలా మందికి భారంగా అనిపిస్తుంది. కానీ నిజానికి రోజుకు ఒక్కసారి మాత్రమే బ్రష్ చేయడం వల్ల దంత ఆరోగ్యానికి, మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా సమస్యలు వచ్యే అవకాశాలు ఉంటాయి. ఉదయం బ్రష్ చేయడం వల్ల నోరు తాజాగా ఉండి రోజంతా శుభ్రంగా ఉంటుంది.
Brushing Teeth | రోజంతా అలసటతో రాత్రి దంతాలను బ్రష్ చేయడం చాలా మందికి భారంగా అనిపిస్తుంది. కానీ నిజానికి రోజుకు ఒక్కసారి మాత్రమే బ్రష్ చేయడం వల్ల దంత ఆరోగ్యానికి, మొత్తం శరీర ఆరోగ్యానికి కూడా సమస్యలు వచ్యే అవకాశాలు ఉంటాయి. ఉదయం బ్రష్ చేయడం వల్ల నోరు తాజాగా ఉండి రోజంతా శుభ్రంగా ఉంటుంది. అయితే రాత్రి నిద్రకు ముందు బ్రష్ చేయడం దంతాలను మరింత రక్షిస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. రాత్రి సమయంలో లాలాజలం (saliva) ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది బ్యాక్టీరియాతో పోరాడే సహజ రక్షణ వ్యవస్థ. నిద్రపోతున్నప్పుడు నోరు చాలా సేపు నిశ్చలంగా ఉంటుంది. ఈ సమయంలో ఆహార అవశేషాలు లేదా బ్యాక్టీరియా మిగిలి ఉంటే అవి దంతాలకు నష్టం కలిగించే అవకాశం ఎక్కువ. అందుకే డెంటిస్టులు రాత్రి బ్రషింగ్ చాలా ముఖ్యమని చెబుతున్నారు.
దంత క్షయం, చిగుళ్ల సమస్యలు..
రోజంతా తిన్న ఆహారం, చక్కెర, బ్యాక్టీరియా కలిసి దంతాలపై ఒక పొరలా పేరుకుంటాయి. రాత్రి బ్రష్ చేయకపోతే అవి గంటల తరబడి అలాగే ఉంటాయి. లాలాజలం తక్కువగా ఉండటం వల్ల బ్యాక్టీరియా వేగంగా పెరిగి ఆమ్లాలను (acids) ఉత్పత్తి చేస్తాయి. ఇవి దంతాల ఎనామెల్‌ను దెబ్బతీసి కావిటీస్ (దంత క్షయం), గమ్ (చిగుళ్ల) సమస్యలకు దారితీస్తాయి. రాత్రి బ్రష్ చేయకపోవడం వల్ల దంతాలు క్షయం ఏర్పడడం, గమ్ వ్యాధులు, దుర్వాసన (బ్యాడ్ బ్రెత్) వంటి సమస్యలు వస్తాయి. ప్లాక్ గట్టిపడి టార్టార్‌గా మారితే దాన్ని తొలగించడానికి డాక్టర్ సహాయం అవసరం అవుతుంది. ఇంకా ప్రమాదకరంగా నోరులోని బ్యాక్టీరియా రక్తంలోకి చేరి ఇతర ఇన్ఫెక్షన్లకు కూడా కారణమవుతాయి.
రాత్రి పూట కూడా బ్రష్ చేస్తే..
ఇక రాత్రి బ్రష్ చేయడం వల్ల అనేక లాభాలు కలుగుతాయని వైద్యులు చెబుతున్నారు. రాత్రి బ్రష్ చేయడం ద్వారా రోజంతా పేరుకున్న మలినాలను తొలగించి దంతాలకు విశ్రాంతి పొందవచ్చు. ఇది కొన్ని నిమిషాల పని అయినా దీని ప్రయోజనం చాలా పెద్దది. బ్రషింగ్‌తో పాటు ఫ్లోసింగ్ చేయడం వల్ల బ్రష్ చేరని చోట్ల కూడా శుభ్రం అవుతుంది. కేవలం బ్రష్ చేయడం మాత్రమే కాకుండా, యాంటీ బ్యాక్టీరియల్ మౌత్‌వాష్ ఉపయోగించడం, నాలుక శుభ్రం చేయడం కూడా మంచిది. ఇవి బ్యాక్టీరియా సంఖ్యను తగ్గించి నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒక్కరోజు బ్రష్ చేయకపోతే పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు. కానీ ఇది అలవాటుగా మారితే క్రమంగా నష్టం పెరుగుతుంది. రోజుకు రెండుసార్లు బ్రష్ చేయడం, రాత్రి ఫ్లోసింగ్ చేయడం వంటి అలవాట్లు జీవితాంతం దంత ఆరోగ్యాన్ని కాపాడతాయి. రాత్రి బ్రష్ చేయడం చిన్న అలవాటే అయినా, దీని ప్రభావం ఆరోగ్యంపై చాలా పెద్దది. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం అవసరమని వైద్యులు సూచిస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్‌ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

