Black Tomato | మార్కెట్లోకి నల్ల టమాటాలు.. రుచి, ఆరోగ్యంలో కొత్త ట్రెండ్!
Black Tomato | బ్లాక్ చెర్రీ టమాటాల్లో ‘ఆంతోసైనిన్స్' అనే యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటివల్లే వాటికి ఆ ముదురు రంగు వస్తుంది. ఈ ఆంతోసైనిన్స్.. గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సాయపడతాయి. శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.
టమాటాలు అనగానే.. ఎర్రగా బుర్రగా కనిపిస్తాయి. కానీ, ఇప్పుడు నలుపు, ముదురు ఊదా రంగుల్లోని ‘బ్లాక్ చెర్రీ టమాటాలు’ మార్కెట్లోకి వస్తున్నాయి. చూసేందుకే కాదు.. రుచితోపాటు ఆరోగ్యప్రయోజనాల్లోనూ ఇవి ఎంతో ప్రత్యేకమని నిపుణులు చెబుతున్నారు. ఈ నల్లటి టమాటాల్లో దాగి ఉన్న ‘సూపర్ పవర్స్’ను వివరిస్తున్నారు.
బ్లాక్ చెర్రీ టమాటాల్లో ‘ఆంతోసైనిన్స్’ అనే యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటివల్లే వాటికి ఆ ముదురు రంగు వస్తుంది. ఈ ఆంతోసైనిన్స్.. గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సాయపడతాయి. శరీరంలోని కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. వృద్ధాప్య ఛాయలనూ తగ్గిస్తాయి. వీటిలోని విటమిన్ ఎ, బీటా కెరోటిన్.. కంటి చూపును మెరుగుపరుస్తాయి. రేచీకటి వంటి సమస్యలు రాకుండా చూస్తాయి. అందుకే, డిజిటల్ స్క్రీన్ల ముందు ఎక్కువ సమయం గడిపే నేటితరానికి ఈ టమాటాలు ఒక వరమనే చెప్పాలి.
ఇందులో అధిక మొత్తంలో లభించే లైకోపీన్, పొటాషియం.. గుండె ఆరోగ్యానికి భరోసా ఇస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి. ఇక ఇందులోని పొటాషియం.. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. నల్ల టమాటాల్లోని విటమిన్ సి.. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గాయాలు త్వరగా మానేలా చేస్తుంది. బ్లాక్ చెర్రీ టమాటాల్లో పీచు పదార్థం ఎక్కువ. కాబట్టి, జీర్ణక్రియ సమస్యలు, మలబద్ధకంతో బాధపడేవారికి మంచి ఉపశమనం దొరుకుతుంది. ఇక ఇందులో కేలరీలు చాలా తక్కువగా, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, బరువు తగ్గాలనుకునేవారికి అద్భుతమైన ఆహారం అని చెప్పొచ్చు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

