Turmeric Milk: పాలల్లో పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిదా.. కాదా.?
పాలల్లో పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిదా.. కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ పసుపు కలిపిన పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Turmeric Milk: పాలల్లో పసుపు కలిపి తాగితే ఆరోగ్యానికి మంచిదా.. కాదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. కానీ పసుపు కలిపిన పాలు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పసుపు కలిపిన పాలు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం..
➦ బరువు తగ్గాలనుకునే వారు పాలల్లో పసుపు కలిపి తాగితే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సాధారణంగా పసుపు కలిపిన పాలల్లో యాంటీ ఇన్ఫ్లేమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గించేందుకు ఉపయోగపడతాయి.
➦ పసుపు కలిపిన పాలు గొప్ప ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తాయి. ఈ పాలు తాగడం వల్ల గుండె సమస్యలు, క్యాన్సర్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
➦ దగ్గు, జలుబు లాంటి వాటి నుంచి ఉపశమనం పొందేందుకు పసుపు కలిపిన పాలు ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఈ పాలు తాగడం వల్ల రక్తం శుద్ధి అవుతుంది.
➦ చర్మ ఆరోగ్యానికి పాలల్లో పసుపు కలుపుకుని తాగడం మంచిది. ఇవి తాగడం వల్ల చర్మం నిగనిగలాడుతుంది.
➦ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఇవి ఉపయోగపడతాయి. పసుపు కలిపిన పాలు తాగడం వల్ల కడుపులో ఉండే ఇబ్బంది తొలిగిపోతుంది. తిన్న ఆహారం సులువుగా జీర్ణమవుతుంది.
➦ సాధారణంగా దీర్ఘకాలిక నొప్పులు రకరకాల సమస్యలకు దారితీస్తాయి. పాలల్లో పసుపు కలిపి తాగితే ఇలాంటి నొప్పులు తగ్గిపోతాయి. అంతేకాకుండా తలనొప్పి సైతం తగ్గుతుంది.
➦ పాలల్లో పసుపు కలిపి తాగితే మెదడు కణజాల వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుందని ఆహార నిపుణులు చెబుతున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

