Hair Transplantation | చాలామంది దృష్టిలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే కేవలం మళ్లీ జుట్టు పెరిగేలా చేసుకోవడమే! నిజానికి ఈ పద్ధతి వల్ల మరెన్నో ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
బట్టతలకు జన్యులోపం ఓ ముఖ్యకారణం. డీహెచ్‌టీ (డై హైడ్రో టెస్టోస్టిరాన్) అనే ఓ హార్మోన్ వల్ల జుట్టు కుదుళ్లు కుదించుకుపోయి, క్రమంగా మూసుకుపోతాయి. ట్రాన్స్‌ప్లాంటేషన్ వల్ల, ఆ కుదుళ్లు మళ్లీ ఆరోగ్యంగా తయారవుతాయి.
ట్రాన్స్‌ప్లాంటేషన్ ఓ శాశ్వత పరిష్కారం. చికిత్స జరిగిన ప్రదేశంలో వెంటనే బట్టతల వచ్చే అవకాశం పెద్దగా ఉండదు.
నిపుణులైన సర్జన్స్ ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు… తలకట్టు ఆకారం అందంగా, యవ్వనంలో ఉన్నంత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో బట్టతల మాత్రమే కాదు… దెబ్బలు, సర్జరీలాంటివి జరిగిన ప్రదేశంలో ఏర్పడిన ఖాళీలను కూడా పూరిస్తుంది.
మందులు, ఇతరత్రా చికిత్సలు పనిచేయని చోట… ట్రాన్స్‌ప్లాంటేషన్ మెరుగైన ఫలితం ఇస్తుంది.
అలాగని, హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ నిర్ణయం చిటికెలో తీసుకునేది కాదు. చర్మవైద్యుడిని, ఆపై సర్జన్‌ని సంప్రదించిన తర్వాత ఆలోచించాకే సర్జరీకి వెళ్లాలి.