వాయు కాలష్యంతో గుండె సంబంధ వ్యాధులు.. యురోపియన్ పరిశోధనలో షాకింగ్ నిజాలు!!
వాయుకాలుష్యానికి గుండె సంబంధ వ్యాధులకు సంబంధం ఉంటుందా..? కలుషితమైన గాలి మనుషుల ప్రాణాలు తీస్తుందా? అంటే అవుననే అంటున్నారు యురోపియన్ పరిశోధకులు. యురోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వార్షిక కాంగ్రెస్‌లో సమర్పించిన ఇటీవలి పరిశోధన ప్రకారం, వాయుకాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో తిరిగేవారికి ప్రాణాంతకమైన హార్ట్ అరిథ్మియా వచ్చే ప్రమాదం ఉందని తేల్చారు. అరిథ్మియా అనేది గుండె సంబంధ వ్యాధి. గుండె వేగంగా లేదా అతినెమ్మదిగా కొట్టుకోవడం ఈ వ్యాధి లక్షణం. ఇంప్లాంటబుల్ కార్డియోవర్టర్ డీఫిబ్రిలేటర్ (ఐసీడీ) ఉన్న రోగులపై అధ్యయనం చేసిన పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు.

కాగా, ఐసీడీ లాంటి వెంట్రిక్యులర్ అరిథ్మియా ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులు రోజువారీ కాలుష్య స్థాయిలను తనిఖీ చేసుకోవాలని తమ అధ్యయనం సూచిస్తుందని పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ అలెసియా జానీ తెలిపారు. 2.5 పీఎం (పర్టిక్యులేట్ మ్యాటర్), 10 పీఎం వాతావరణ కాలుష్యం ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాలని, ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే ఎన్95 మాస్కు ధరించాలని ఆమె సూచించారు. ఇంట్లో ఎయిర్ ప్యూరిఫైయర్ వాడితే మంచిదన్నారు.
డబ్ల్యూహెచ్‌వో ప్రకారం బహిరంగ వాయు కాలుష్యం ప్రతి ఏటా 4.2 మిలియన్ల మందిని పొట్టనపెట్టుకుంటున్నదని తెలిపింది. దాదాపు ప్రతి ఐదుగురిలో ఒకరు వాతావరణ కాలుష్యం కారణంతో గుండె సంబంధ వ్యాధులతో మరణిస్తున్నారని పేర్కొంది. హై బీపీ, పొగాకు వినియోగం, పోషకాహార లోపంతో సంభవించే మరణాల తర్వాత ఈ మరణాలు నాలుగో స్థానంలో ఉన్నట్లు వివరించింది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Arjun Rajput: పాకిస్థాన్‌తో వన్డే మ్యాచ్.. అర్జున్ రాజ్‌ఫుత్ సెంచరీ
IdupuKayitham | దీపావళి స్పెషల్.. ‘ఇడుపు కాయితం’ నుంచి అదిరిపోయేలా నాగదుర్గ ‘బారాత్ బీట్’ సాంగ్
PM Modi: బస్తర్‌లో భద్రతా బలగాలతో ప్రధాని మోదీ దీపావళి వేడుక.. దిమాగీ నక్సల్స్‌పై హెచ్చరిక
పింక్ శారీలో శ్రీనిధి శెట్టి పరువాల జాతర.. ఫొటోలు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి