Amla Juice And Wheatgrass Juice | ఉసిరి రసం, గోధుమ గడ్డి రసం.. రెండింట్లో లివర్ ఆరోగ్యానికి ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?
దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (Non-alcoholic fatty liver disease) సమస్య ఉన్నట్లు అంచనా. బయటకు సన్నగా కనిపించినప్పటికీ, అంతర్గతంగా అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోవడం దీనికి ప్రధాన కారణం. అధిక కార్బొహైడ్రేట్లు, కూర్చునే జీవనశైలి, ఒత్తిడి.. ఇవన్నీ లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
Amla Juice And Wheatgrass Juice | దేశంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (Non-alcoholic fatty liver disease) సమస్య ఉన్నట్లు అంచనా. బయటకు సన్నగా కనిపించినప్పటికీ, అంతర్గతంగా అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోవడం దీనికి ప్రధాన కారణం. అధిక కార్బొహైడ్రేట్లు, కూర్చునే జీవనశైలి, ఒత్తిడి.. ఇవన్నీ లివర్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఈ పరిస్థితిలో సరైన ఆహారపు అలవాట్లు ఎంతో ముఖ్యమవుతాయి. లివర్ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ఆహారాల్లో ఉసిరి రసం, గోధుమ గడ్డి రసం రెండూ శక్తివంతమైన పానీయాలు అని చెప్పవచ్చు. వీటి పోషక విలువలు, ప్రయోజనాలు భిన్నంగా ఉన్నప్పటికీ, ఫ్యాటీ లివర్ సమస్యను నియంత్రించడంలో రెండూ కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ఉసిరి రసం..
ఉసిరి రసం లివర్ ఆరోగ్యానికి బలమైన సహాయకారిగా పనిచేస్తుంది. ఇది విటమిన్ సి ని సమృద్ధిగా కలిగి ఉంటుంది. నారింజ కంటే దాదాపు 20 రెట్లు ఎక్కువగా ఆ విటమిన్ ఉంటుంది. అలాగే టానిన్స్ వంటి ప్రత్యేక సమ్మేళనాలు లివర్లో హానికర పదార్థాలు పేరుకుపోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. Journal of Medicinal Foodsలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం, ఉసిరి ఎక్స్ట్రాక్ట్ చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇక గోధుమ గడ్డి రసాన్ని గ్రీన్ బ్లడ్ గా పిలుస్తారు. ఇందులో సుమారు 70 శాతం క్లోరోఫిల్ ఉండటం వల్ల ఇది శరీరాన్ని ఆల్కలైన్ స్థితిలో ఉంచడంలో సహాయపడుతుంది. International Journal of Chemical Studiesలోని పరిశీలనల ప్రకారం, దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే లివర్ ఎంజైమ్ల స్థాయిలను సమతుల్యం చేయవచ్చు. ఇవి లివర్ ఇన్ఫ్లమేషన్ (వాపు)కు సూచికలు.
గోధుమగడ్డి రసం..
ఉసిరి రసం వల్ల లిపిడ్ నియంత్రణ మెరుగుపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ను నిరోధించి లివర్ కణాల నష్టాన్ని తగ్గిస్తుంది. అందుబాటులో సులభంగా లభించటం వల్ల దీన్ని దీర్ఘకాలిక అలవాటుగా మార్చుకోవచ్చు. గోధుమ గడ్డి రసం కణ స్థాయిలో డిటాక్సిఫికేషన్కు సహాయపడుతుంది. క్లోరోఫిల్ అధికంగా ఉండటం వల్ల శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహకరిస్తుంది. అలాగే లివర్ ఎంజైమ్లను నియంత్రించి ఇన్ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచి ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరుస్తుంది. దీనిలోని బయో ఫ్లేవనాయిడ్స్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఏది ఉత్తమం..
ఈ రెండింటిలో ఏది మంచిదంటే, ఉసిరి రసం ఫ్యాటీ లివర్ నియంత్రణలో ఎక్కువగా ప్రభావవంతమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా లివర్లో కొవ్వు తగ్గించడంలో ఇది కొంత మెరుగైన ఫలితాలు ఇస్తుంది. అయితే మరింత సమగ్ర ప్రయోజనం కోసం, ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఉదయం ఖాళీ కడుపుతో 15 మి.లీ ఉసిరి రసం, 15 మి.లీ గోధుమ గడ్డి రసం కలిపి గోరువెచ్చని నీటితో తీసుకోవచ్చు. అయితే ఏదైనా కొత్త ఆహారాన్ని రోజువారీ అలవాటుగా మార్చుకునే ముందు, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవడం అవసరం. నియమిత ఆహారం, వ్యాయామం, సమతుల జీవనశైలి కలిపి లివర్ ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

