Jaggery Benefits | బెల్లం తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా ? అస్సలు మిస్ కావొద్దు
Jaggery Benefits | గాలి కాలుష్యం తీవ్ర సమస్యగా పరిణమించింది. మాస్కులు, ఎయిర్ ప్యూరిఫయర్లతో ఆ ప్రభావం నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు. ఆహారం కూడా కాలుష్య సంక్షోభం నుంచి మనల్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పోషకాలతో సమృద్ధమైన బెల్లాన్ని భోజనంలో భాగం చేసుకోవాలి.
Jaggery Benefits | గాలి కాలుష్యం తీవ్ర సమస్యగా పరిణమించింది. మాస్కులు, ఎయిర్ ప్యూరిఫయర్లతో ఆ ప్రభావం నుంచి కొంతమేర తప్పించుకోవచ్చు. ఆహారం కూడా కాలుష్య సంక్షోభం నుంచి మనల్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పోషకాలతో సమృద్ధమైన బెల్లాన్ని భోజనంలో భాగం చేసుకోవాలి. అప్పుడప్పుడూ నేరుగా నోట్లో వేసుకోవచ్చు కూడా. ఎందుకంటే బెల్లం పోషకాల గని. అపార పోషక విలువలు: ఐరన్, మెగ్నీషియం, పొటాషియం లాంటి కీలకమైన మినరల్స్తో సమృద్ధం. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి మనల్ని కాలుష్యం బారినుంచి కాపాడటంలో సహాయకారిగా నిలుస్తాయి.
శ్వాస వ్యవస్థ శుద్ధిలో:
కాలుష్యం వల్ల వెలువడే ధూళి కణాలు ఊపిరితిత్తులకు తీవ్ర హాని చేస్తాయి. ఈ క్రమంలో బెల్లం శ్వాసనాళాల శుద్ధికి దోహదపడుతుంది. వ్యర్థాలు, కాలుష్య కారకాలను తొలగిస్తుంది. వాయుకాలుష్యం ముప్పును తగ్గిస్తుంది.
వ్యాధి నిరోధకత:
బెల్లం శక్తిమంతమైన పోషకాల గని. వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. కాలుష్యం వల్ల తలెత్తే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి.. శరీరానికి బలమైన రోగ నిరోధక వ్యవస్థ అవసరం. కాలుష్యం వల్ల ఎదురయ్యే ఆరోగ్య సమస్యలపై పోరాటానికి శరీరానికి తగిన బలాన్ని ఇస్తుంది బెల్లం.
వ్యర్థాల తొలగింపులో:
శరీరంలో పేరుకున్న టాక్సిన్లను కాలేయం బయటికి పంపుతుంది. ఈ ప్రక్రియలో బెల్లం సహాయకారిగా ఉంటుంది. పారిశ్రామిక, వాహన కాలుష్యం బారినపడినప్పుడు, కాలుష్య పదార్థాలను శరీరం నుంచి తరిమేయడంలో ముందువరుసలో ఉంటుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

