పరిణీతి చోప్రా (Parineeti Chopra)..మూవీ లవర్స్ కు పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేని పేరు. తన యాక్టింగ్‌తో చాలా మంది ఫాలోవర్లను ఖాతాలో వేసుకుందీ బాలీవుడ్ (Bollywood) భామ. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్‌మీడియాలో చురుకుగా ఉంటుంది. అప్పుడప్పుడు వెకేషన్ స్టిల్స్ తోపాటు హాట్ హాట్ ఫొటోలు కూడా పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ భామ న్యూ హాట్ ఫొటోషూట్ తో నెటిజన్ల ముందుకొచ్చింది. స్లీవ్‌లెస్ టాప్ విత్ బ్లాక్ షార్ట్ డ్రెస్‌లో అందాలు ఆరబోస్తూ కెమెరాకు ఫోజులిచ్చింది.
ప్రముఖ మ్యాగజైన్ ఫిలింఫేర్ (Filmfare photoshoot) కోసం ఇలా మారిపోయింది పరిణీతి చోప్రా. బోల్డ్ అవతార్‌లో నెటిజన్లకు నిద్రపట్టకుండా చేస్తున్న పరిణీతి చోప్రా ఫొటోలు ఆన్ లైన్లో హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఏడాది బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నేహ్వాల్ బయోపిక్ సైనాలో మెరిసింది పరిణీతి. ప్రస్తుతం టీవీ డైరెక్టర్ రిబూ దాస్ గుప్తా డైరెక్షన్లో ఓ సినిమాతోపాటు మరో ప్రాజెక్టులో కూడా నటిస్తోంది.