ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ పర్యాటక ప్రదేశాల్లో ఒకటి మాల్దీవులు (Maldives). సెలబ్రిటీలు వెకేషన్ టూర్ వేసుకునే ప్రదేశాల్లో మొదటి స్థానంలో ఉంటుంది. నిత్యం ఎవరో ఒక సెలబ్రిటీ సందడితో కలకలలాడిపోతుంది మాల్దీవులు బీచ్. ఇంతకీ ఈ బీచ్ టాపిక్ మళ్లీ ఎందుకొచ్చిందనుకుంటున్నారా..? అందరికీ ఇప్పటికే అర్థమై ఉంటుంది. మరో బాలీవుడ్ సెలబ్రిటీ మాల్దీవులు టూర్ కు వెళ్లింది. ఇటీవలే అందమైన ఐలాండ్ నేషన్లో అడుగుపెట్టింది పరిణీతి చోప్రా (Parineeti Chopra).
బ్రౌన్ స్విమ్ వేర్లో స్టన్నింగ్ లుక్లో మెరిసిపోతుంది పరిణీతి చోప్రా. సాగరతీరంలో ఈత కొడుతూ సముద్ర అందాలను ఆస్వాదించింది. మాల్దీవుల్లోని అందమైన రిసార్ట్స్ ల్లో కుటుంబసభ్యులతో సరదాగా కాలక్షేపం చేసింది. యెల్లో స్విమ్ వేర్లో వెల్లకిలా పడుకుని నీటిలో ఆసనాలు వేసింది. మరోవైపు రెడ్ బికినీ అందాల కనువిందు చేసి..నెటిజన్లకు కంటిమీద కనుకు లేకుండా చేస్తోంది. మాల్దీవుల నుంచి తన ఫాలోవర్లు, అభిమానులకు హలో చెప్పింది.
పరిణీతి చోప్రా మాల్దీవుల్లో తెగ ఎంజాయ్ చేసిన స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. పరిణీతి చోప్రా ప్రస్తుతం సైనా నేహ్వాల్ బయోపిక్ లో నటిస్తోంది. దీంతోపాటు సందీప్ ఔర్ పింకీ పరార్, నెట్ ఫ్లిక్స్ ది గర్ల్ ఆన్ ది ట్రైన్ ప్రాజెక్టులు చేస్తోంది.
పరిణీతి మాల్దీవుల టూర్ పై మీరూ ఓ లుక్కేయండి మరి..
Pawan Kalyan | పవన్ కల్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
Nabha Natesh | లెజెండరీ నటుడి గెటప్ లో ఇస్మార్ట్ భామ..స్పెషల్ ఏంటో..?
సమంత వదిన.. మీరు మా అన్నయ్యతోనే ఉండాలి.. చైసామ్ విడాకులపై శ్రీరెడ్డి స్పందన