పోలీస్ వారియర్

రామ్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘ది వారియర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. కృతిశెట్టి కథానాయిక. సోమవారం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఈ పోస్టర్లో ఖాకీ దుస్తులు ధరించి చేతిలో రివాల్వర్ పట్టుకొని సీరియస్ లుక్‌లో పవర్ఫుల్ పోలీసుగా రామ్ కనిపిస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘తొలిసారి రామ్ పోలీస్ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమాతోనే ఆయన తమిళ చిత్రసీమలోకి అరంగేట్రం చేస్తున్నారు. ఉత్కంఠభరితమైన కథ, ఫాస్ట్ ఫేజ్డ్ స్క్రీన్‌ప్లేతో సరికొత్తగా ఉంటుంది. ఈ నెలలో కొత్త షెడ్యూల్ ప్రారంభించాం. ప్రస్తుతం ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. తెలుగు, తమిళ భాషల్లో అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా సినిమాను రూపొందిస్తున్నాం’ అని తెలిపారు. ఆది పినిశెట్టి, అక్షర గౌడ ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: సుజీత్ వాసుదేవ్, మాటలు: సాయిమాధవ్ బుర్రా-లింగుస్వామి, సంగీతం: దేవిశ్రీప్రసాద్.
Read Today's Latest Entertainment News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Puri Jagannadh | ‘జార్జ్ క్రిష్’ సెట్స్‌లో పూరి జగన్నాథ్ సందడి.. శ్రీను వైట్లకు అదిరిపోయే సర్ప్రైజ్!
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి : డీఎంహెచ్ఓ డా.రాహుల్
Farmers | సాగు నీటి కోసం రెండు గ్రామాల రైతుల వాగ్వాదం.. వీడియో
Prince William: ప్రిన్స్ విలియమ్‌తో కలిసి క్రికెట్ ఆడిన గంగూలీ, రహానే
‘ఉప సర్పంచుల చెక్ పవర్‌పై ఆంక్షలు ఎత్తివేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

