ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్ రెహమాన్ ఇంట పెళ్లి సందడి మొదలుకానుంది. ఆయన తనయ ఖతీజా రెహమాన్ నిశ్చితార్థం ఆడియో ఇంజినీర్, వ్యాపారవేత్త అయిన రియాస్దీన్ షేక్ మెహమ్మద్తో గత డిసెంబర్ 29న జరిగింది. కాబోయే భర్త ఫొటోను ఆదివారం ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది ఖతీజా. తన పుట్టినరోజు నిశ్చితార్థం జరిగినట్లు తెలిపింది. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక నిర్వహించినట్లు పేర్కొన్నది. త్వరలో వీరి పెళ్లి జరుగనున్నట్లు సమాచారం. తండ్రి బాటలోనే సంగీతప్రపంచంలోకి అడుగుపెట్టిన ఖతీజా నేపథ్యగాయనిగా తమిళ చిత్రసీమలో రాణిస్తున్నది. ‘ఎంతిరన్(తెలుగులో ‘రోబో’) సినిమా ద్వారా ఖతీజా గాయనిగా పరిచయమైంది. ఏ.ఆర్.రెహమాన్‌కు ముగ్గురు సంతానం ఉన్నారు. వారిలో ఖతీజా పెద్దది.