అవమానమొకచోట
అనుమానమొకనోట
ఆంక్షలింకొకచోట
వివక్షతలే ఇచట..
భరియించుకుంటూనే
నివురుగప్పిన నిప్పోలె
రగులుతున్నది అవని!
ఆంక్షలు తుంచుకొని
అవమానం అధిగమించి
అనుమానం నివృత్తి చేసుకొని
వివక్షతలనొడలి
ఆత్మ విశ్వాసియై..
కదలి సాగాలీ.. కడలి దాటాలీ..
నీకు నువ్వే పోటీ
ఎవరు లేరు నీకు సాటి..
భవితనెరిగి ఆశలే ఆశయాలై
సాగాలి కనులార సాధించగ
చెదరని ధైర్యమై మహిళా..
ఆగనీ భానుడి జ్వలిలా..!
– పాల్వంచ హరికిషన్
95024 51780